చిన్న సినిమాకూ అన్ని కోట్లు డిమాండ్ చేస్తే ఎలా? హీరోల రెమ్యూనరేషన్ పై నిర్మాత షాకింగ్స్ కామెంట్స్!

By team teluguFirst Published Jan 16, 2023, 6:58 PM IST
Highlights

చిన్న సినిమాలకు కూడా కొందరు హీరోలు బాగా ఛార్జ్ చేస్తుండటం పట్ల తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సినిమా ఆడకపోతే తాము తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు చిన్న సినిమాలకు కూడా అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటం బాధాకరమన్నారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (Bhushan Kumar). తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా కొందరు యాక్టర్స్ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ప్రొడ్యూసర్ అనేవాడు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ ఆవేదన చెందారు. సినిమా బడ్జెట్ లో సగం  హీరోల రెమ్యూనరేషనే ఉంటోందని అన్నారు. 

ఇదే విషయంపై గతంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్  కూడా ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మాత భూషణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ‘ఇండస్ట్రీలో కొందరు హీరోలు ప్రొడ్యూసర్స్ ను బాగా అర్థం చేసుకుంటారు. ఎలాంటి డిమాండ్ చేశారు. కానీ కొందరు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా భారీ మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క హీరోకే రూ.20 నుంచి రూ.25 కోట్ల దాకా ముట్టజెప్పాల్సి వస్తోంది. ఒక వేళ సినిమా ఆడకపోతే తీవ్రస్థాయిలో నష్టాలు చూస్తున్నాం. తలకు మించి భారం మోయడమెందుకని మేమూ కఠినంగా ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని వెల్లడించారు. 

ప్రస్తుతం బాలీవుడ్ లో పరిస్థితి అంత బాగాలేకపోవడంతో.. నిర్మాతలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. హీరోల రెమ్యూనరేషన్, మార్కెట్ పరిస్థికి తగ్గట్టుగా ఉండటం లేదని భూషణ్ కుమార్ స్పష్టం చేశారు. కొందరు హీరోలు మాత్రమే అర్థం చేసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక టీ-సిరీస్ నుంచి గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన Bhool bhulaiyaa బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం భారీ అంచనాలతో ‘యానిమల్’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ కూడా ఈ బ్యానర్ లోనే రానుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

click me!