మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ, క్యాన్సర్ తో బాధపడుతన్న విద్యార్థినికి చేయూత

Published : Jan 16, 2023, 04:38 PM IST
మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ, క్యాన్సర్ తో బాధపడుతన్న విద్యార్థినికి చేయూత

సారాంశం

మరో సారితన మంచి మనసు చాటుకున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. క్యాన్సర్ తో పోరాడుతూ.. పేదరికంలో మగ్గుతున్న విద్యార్థినిని ఆదుకున్నారు. 

మాట కరుకు కాని బాలయ్య మనసు వెన్న అంటూ వినిపించే మాటలు నిజం అని నిరూపించుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ.  రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఆయన  హీరోనే అని నిరూపించుకున్నాడు. ఓ క్యాన్సర్‌ పేషెంట్‌కు చేయూతనిచ్చి.. ఆమె కొలుకునేలా చర్యలు తీసుకుని.. గొప్ప మనసు చాటుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయి ఇంటర్‌  చదువుతోంది. చదువులో మంచి ప్రతిభ కనబరిచే ఆ బాలిక  బోన్ క్యాన్సర్‌ బారిన పడింది. దాంతో డాక్టర్లు  ఆపరేషన్‌ కోసం 10 లక్షలకు పైగా అవుతుందని చెప్పారు. 

అయితే రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబానికి అంత ఖర్చు చేసే స్తోమత లేదు కాని ఈ విషయంతెలుసుకున్న బాలకృష్ణ, బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆ విద్యార్థిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ అమ్మాయికి ఉచిత చికిత్స అందిస్తున్నాడు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడి.. ఆ ఇంట్లో సంతోషాన్ని నింపారు బాలయ్య బాబు. ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం  తెలుసుకున్న బాలకృష్ణ అభిమానులు.. మా బాలయ్య బంగారం, జై బాలయ్య అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

 

ఇక వరుస సినిమాలతో ఒక ఊపు ఊపేస్తున్నారు బాలయ్య.. అఖండ సినిమా అఖండ విజయం తరువాత  బాలకృష్ణలో జోరు పెరిగింది. వరుస సినిమాలు సెట్స్ ఎక్కించేస్తున్నారు. రీసెంట్ గా ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో  నటించిన వీరసింహా రెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజై మంచి టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్‌లలో జోరు చూపిస్తుంది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ సాధించి బాక్సాఫీస్‌ దగ్గర తన సత్తా ఏంటో నిరూపించాడు. 
 

 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?