జీవితా రాజశేఖర్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆ విషయంలో ఆదర్శ దంపతులంటూ సెటైర్..

Published : Aug 26, 2022, 07:22 PM IST
జీవితా రాజశేఖర్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆ విషయంలో ఆదర్శ దంపతులంటూ సెటైర్..

సారాంశం

సినీనటులు జీవితా రాజశేఖర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్, పొలిటీషన్  బండ్ల గణష్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల బండి సంజయ్ చేపట్టిన దీక్షలో పాల్గొన్న వీరిపై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  

టాలీవుడ్ నటులు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దంపతులపై తాజాగా సినీ నిర్మాత, పొలిటీషన్ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ ఏదోరకమైన కామెంట్స్ తో బండ్లన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. తాజాగా జీవితా రాజశేఖర్ మీద బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే  ఇటీవల జీవితా రాజశేఖర్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం బీజీపీలో కొనసాగుతున్న వీరు సంజయ్ కు మద్దతునిస్తూ ఈ యాత్రలో భాగస్వామ్యులయ్యారు. 

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను ఉద్దేశించి  పలు ఆరోపణలు చేసింది. హైదరాబాద్‌లోని ఆయా పబ్‌ల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలున్నాయని సెన్సేషనల్ కామెంట్ చేశారు. పవర్ చేతిలో ఉందని కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నదని ఆరోపించారు. తెలంగాణ రాక ముందుకు, ప్రస్తుతం సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులను లెక్కకడితే అసలు బయటికి వస్తాయని, ఎంత ఆస్తి ఉందో ప్పే ధైర్యం ఉందా..? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ కు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. 

బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు  ఈ ఆదర్శ దంపతులు. ఇంకా సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పార్టీల్లోనూ చేరి బ్యాలెన్స్ చేయండి అక్కా’ అంటూ షాకింగ్ గా కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా జీవిత, రాజశేఖర్ దంపతులు గతంలో పలు పార్టీల్లో చేరినప్పటి ఫొటోలను సైతం ట్వీట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన పోస్టు  నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో