పవన్ మంచోడే కానీ అతనితో ప్రాబ్లమ్... ఎట్టకేలకు ఓపెన్ అయిన బండ్ల గణేష్ 

Published : Mar 18, 2023, 12:52 PM ISTUpdated : Mar 18, 2023, 01:16 PM IST
పవన్ మంచోడే కానీ అతనితో ప్రాబ్లమ్... ఎట్టకేలకు ఓపెన్ అయిన బండ్ల గణేష్ 

సారాంశం

పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ మధ్య దూరం పెరిగిందని కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ వార్తలను బలపరిచే విధంగా బండ్ల గణేష్ ట్వీట్ ఉంది.   

హీరో పవన్ కళ్యాణ్ తో నిర్మాత బండ్ల గణేష్ కి చెడిందన్న ప్రచారం జరుగుతుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తనను పిలవలేదని దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టారు. ఆ ఆడియో కాల్ బయటకు రావడంతో బండ్ల గణేష్ ఇరుకునపడ్డారు. అది నా వాయిస్ కాదని బండ్ల గణేష్ మొదట బుకాయించాడు. కొన్నాళ్ల తర్వాత కోపంలో రెండు మాటలు అన్నాను, త్రివిక్రమ్ ని కలిసి సారీ చెప్పానని తప్పు ఒప్పుకున్నాడు. అయితే త్రివిక్రమ్ ని తిట్టడంతో ఆగ్రహానికి గురైన పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టారట. 

భీమ్లా నాయక్ విడుదలై ఏడాది అవుతుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ కలవలేదు. చెప్పాలంటే బండ్ల గణేష్ కి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. బండ్ల గణేష్ చేసిన సంధి ప్రయత్నాలన్నీ విఫలం చెందాయట. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. అప్పుడప్పుడు బండ్ల గణేష్ ట్వీట్స్ పవన్ ని టార్గెట్ చేస్తున్నట్లు ఉంటున్నాయి. 
 

అదే సమయంలో పవన్ తనకు దూరం కావడానికి త్రివిక్రమ్ కారణం అని బండ్ల గణేష్ గట్టిగా నమ్ముతున్నాడట. ఆయన తాజా ట్వీట్ దీన్ని ధృవపరిచింది.  పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు... 'పవన్ అన్నని అపార్థం చేసుకొని దూరం కావద్దు. ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి మీలాంటి వాళ్ళు రిలీఫ్. సమయం చూసుకొని ఆయన్ని ఒకసారి కలువు', అని సలహా ఇచ్చాడు. పవన్ అభిమాని ట్వీట్ కి స్పందించిన బండ్ల గణేష్... 'మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం, ఏం చేద్దాం బ్రదర్', అని రిప్లై ఇచ్చాడు. 

ఇక్కడ డాలర్ శేషాద్రి అని విమర్శించింది త్రివిక్రమ్ గురించే అని పవన్ అభిమానుల అభిప్రాయం. బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ మీద చాలా కోపంగా ఉన్నాడు అనడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు. అన్నీ బాగుంటే పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ నిర్మించి సెటిల్ అవుదామని ఆశపడ్డ బండ్ల గణేష్ ఆశలపై నీళ్లు చల్లాడు త్రివిక్రమ్. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం