'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' OTT రిలీజ్ డిటేల్స్ !

By Surya PrakashFirst Published Mar 18, 2023, 12:46 PM IST
Highlights

నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్  కాంబినేషన్లో మరో సినిమాగా 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' రూపొందింది. నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్ నటించిన ఈ సినిమా, ఈ శుక్రవారం థియేటర్స్  కి వచ్చింది.


శ్రీనివాస్‌ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్‌  కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానందా’ సినిమాలు కల్ట్‌ క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించకపోయినా.. గుర్తుండిపోయే సినిమాలు ఇవి.  ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్ల కలయికలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే న్యూఏజ్‌ లవ్‌స్టోరీ తెరకెక్కింది.  ఈ చిత్రం నిన్న శుక్రవారం రిలీజైంది.ఈ చిత్రం మార్నింగ్ షోకే తేడా టాక్ వచ్చింది. మరీ స్లోగా ఉందని, సినిమాలో విషయం లేదని రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చాలా మంది ఓటిటిలో ఈ సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యారు. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రతం ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ Sun NXT వారు సొంతం చేసుకున్నారు. రెగ్యులర్ గా అమేజాన్ లేదా నెట్ ప్లిక్స్, ఆహాలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతూంటాయి. కానీ ఈ సారి రూట్ మారి Sun NXTకు వచ్చింది.  నెలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు ఎగ్రిమెంట్ అయ్యిందని వినికిడి. అంటే ఏప్రియల్ 17 కు ఓటిటిలో ఈ సినిమాకు మనకు దర్శనమిస్తుందన్నమాట.

చిత్రం కథేమిటి అంటే...సంజయ్ (నాగశౌర్య) అనుపమ (మాళవిక నాయర్) కాలేజ్ రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. పై చదువుల కోసం ఫారిన్ వెళతారు. అక్కడా వారి మధ్య ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే అనుపమకి  ఒక సర్జరీ జరుగుతుంది. ఆ సమయంలో తన దగ్గర సంజయ్ లేకపోవడం .. ఎన్నిసార్లు కాల్ చేసినా అతను రాకపోవడం అనుపమకు బాధను కలిగిస్తుంది. ఆ సంఘటన ఆ ఇద్దరి మధ్య దూరం పెంచుతూ వెళుతుంది. అదే సమయంలో సంజయ్ కి పూజ (మేఘ చౌదరి) పరిచయమవుతుంది. అలాగే గిరి (అవసరాల)తో అనుపమకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో జర్నీ ప్రారంభిస్తారు. చివరకు వాళ్ళిద్దరూ ఒకటి అవుతారా లేదా  అనేదే కథ. 

  ఈ సినిమాలో కళ్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా సునీల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుిన  ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్‌ నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై టీ.జి విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక మార్చి 17న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది.  ఓటిటిలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.  
 

click me!