నేను చాలా..? హీరో కూడా పడుకోవాలా..? హీరోయిన్ శృతి కామెంట్స్!

Published : Apr 05, 2019, 10:04 AM ISTUpdated : Apr 05, 2019, 12:00 PM IST
నేను చాలా..? హీరో కూడా పడుకోవాలా..? హీరోయిన్ శృతి కామెంట్స్!

సారాంశం

పలు తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించిన శృతి మరాటే తాను ఎదుర్కొన్న మీటూ సంఘటన గురించి బయటపెట్టింది. 

పలు తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించిన శృతి మరాటే తాను ఎదుర్కొన్న మీటూ సంఘటన గురించి బయటపెట్టింది. ఓ నిర్మాత తనతో తప్పుగా ప్రవర్తించారని, అతడికి ధీటైన సమాధానం చెప్పానని వెల్లడించింది. 

ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవం ఆమె మాటల్లోనే.. ''అప్పట్లో అవకాశం రావడమే గొప్ప. అందుకే అడిగిన వెంటనే బికినీ ధరించాను. నాకు కాస్త ఫేం వచ్చిన తరువాత ఆ బికినీ ఫోటోలను బాగా ట్రోల్ చేశారు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను కానీ ఓ నిర్మాత సినిమా ఆఫర్ ఇస్తానని నన్ను సంప్రదించాడు. మొదట బాగానే మాట్లాడాడు. కాసేపటికి కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరాత్రి పడుకోవాలని అన్నాడు. వెంటనే నేను..హీరోని కూడా ఇలానే అడిగావా..? అని అతడిని  ప్రశ్నించాను'' అంటూ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది.

నిర్మాత చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో తనను సినిమా నుండి తప్పించారని.. అయినప్పటికీ తను బాధపడలేదని తెలిపింది. కేవలం మహిళల్లో ధైర్యం నింపడానికే తను ఈ ఘటన గురించి బయటపెట్టానని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో రెండు సినిమా అవకాశాలు దక్కాయి.  

PREV
click me!

Recommended Stories

Dasari Narayana Rao: అప్పట్లో అరటిపళ్లు అమ్మేవాడిని.! ఆకలిని చూశా.. పేదరికాన్ని జయించా..
జీవితంలో కచ్చితంగా సక్సెస్ కావాలని రూల్‌ ఏం లేదు బాసూ.. పూరీ చెప్పిన జీవిత స‌త్యం