ఎన్టీఆర్ తో కలిసి షోలే చూశాను...ఆయన మా చిత్రంలో నటించడం గొప్ప అనుభూతి - అశ్వినీ దత్

By Satish Reddy  |  First Published Oct 9, 2020, 4:54 PM IST

ప్రభాస్ 21లో అమితాబ్ నటిస్తున్నాడన్న వార్త దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్ర నిర్మాత అమితాబ్ తో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఈ చిత్రంలో నటించడం కలిగిన అనుభూతిని తెలియజేశారు.


దశాబ్దాల చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 500కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుండగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కథ ఏమిటీ, ఏ జోనర్ అనేది ఇంకా  సస్పెన్సు గానే ఉంది. 

కథ ఏదైనా మూవీని మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఆయన కాన్ఫ్డెన్స్ చూస్తుంటే మూవీ ప్రేక్షకుల ఊహకు మించి ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. నేడు ప్రభాస్ 21 మూవీలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్న ప్రకటన విడుదల చేశారు. లెజెండరీ మూవీ కోసం లివింగ్ లెజెండ్ ని తీసుకున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పడం ప్రేక్షకులకు మరింత జోష్ ఇచ్చింది. 

Latest Videos

ఇక చిత్ర నిర్మాత అశ్వినీ దత్ తన ఆనందాన్ని తెలియజేస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అమితాబ్ పై తనకున్న గౌరవభావాన్ని తెలియజేశారు. ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన వైజయంతి మూవీస్ మహానటి లాంటి చిత్ర రాజాన్ని నిర్మించామని చెప్పారు. మహానటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 

ప్రభాస్ 21లో అమితాబ్ భాగమవుతుండగా కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు. నటసార్వభౌముడు ఎన్టీఆర్ ని ఆరాధించే అమితాబ్ నటించి షోలే సినిమాను అనేక మార్లు అశ్విని దత్ చూశారట. ఎన్టీఆర్ తో కలిసి రామకృష్ణ థియేటర్స్ లో షోలే మూవీ ఆయన పదుల సంఖ్యలో చూశారట. అలాంటి అమితాబ్ తమ చిత్రంలో నటించడం గొప్ప విషయంగా అశ్వినీ దత్ తెలియజేయారు. 

click me!