ప్రైమ్ సంచలనం: ఏకంగా తొమ్మిది సినిమాలు మీముందు తెస్తుంది..!

By Satish ReddyFirst Published Oct 9, 2020, 12:14 PM IST
Highlights

ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మిగతా సంస్థలకు గట్టిపోటీ ఇస్తూ ముందుకు వెళుతుంది. భారీ చిత్రాలను దక్కించుకొని ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. రానున్న కాలంలో ఏకంగా 9 క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రైమ్ ద్వారా విడుదల కానున్నాయి. సూర్య సురారై పోట్రు మూవీ తోపాటు  కూలి నంబర్ వన్, దుర్గావతి చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఓటిటి అన్నట్లు తయారైంది. వినోదం ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసిన ఓటిటిలో సినిమాలు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్, రియాలిటీ షోలు, స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కావలసిన వినోదం ఒకచోట చేర్చి అందిస్తున్నాయి ఓటిటి సంస్థలు. దీనితో ఆడియెన్స్ లో వీటిపై ఆదరణ పెరుగుతూ పోతుంది. 

అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఇండియాపై ఆధిపత్యం కోసం ఓటిటి దిగ్గజాలు పోటీపడుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ వంటి సంస్థలు ఈ రేసులో ముందున్నాయి. భారీ చిత్రాలను కొనుగోలు చేస్తున్న అమెజాన్ అధిక పెట్టుబడులు పెడుతుంది. పెద్ద పెద్ద ఇండియన్ చిత్రాలను దక్కించుకుంటూ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటుంది . ఇప్పటికే వి, నిశ్శబ్దం వంటి చిత్రాలను కొనుగోలు చేసి విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్, ఏకంగా వివిధ భాషలకు చెందిన తొమ్మిది చిత్రాలను దక్కించుకోవడం జరిగింది. 

వరుణ్ ధావన్ నటించిన కూలి నంబర్ వన్, సూర్య- సుధ కొంగరల క్రేజీ ప్రాజెక్ట్ సురారై పోట్రు లతో పాటు తెలుగు హిట్ మూవీ భాగమతి హిందీ రీమేక్ దుర్గావతి వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 2వ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా ప్రైమ్ లో విడుదల కానుంది. వీటితో పాటు ఛలాంగ్, హలాల్ లవ్ స్టోరీ, భీమసేన నలమహారాజా, మారా, మన్నే నంబర్ 13 చిత్రాలు ప్రైమ్ లో విడుదల కానున్నాయి. 

భారతీయ మూవీ లవర్స్ ని అమెజాన్ పెద్ద ఎత్తున తనవైపు తిప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీ చిత్రం దుర్గావతి, సూర్య సురారై పోట్రు చిత్రాలపై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. దీనితో భారీగా అమెజాన్ ప్రైమ్ కి చందాదారులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా అమెజాన్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ పోటీ ఆసక్తిగా మార్చేసింది. 

click me!