అందాల ఆరబోతకు సిద్ధమే అంటోన్న ప్రియాంక జవాల్కర్‌.. కానీ

Published : Dec 05, 2021, 09:17 PM IST
అందాల ఆరబోతకు సిద్ధమే అంటోన్న ప్రియాంక జవాల్కర్‌.. కానీ

సారాంశం

`టాక్సీవాలా` సక్సెస్‌ను వాడుకోలేకపోయానని చాలా మంది అన్నారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధి రాతను ఎవరూ మార్చలేరు. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`, `తిమ్మరుసు` ఇంత హిట్‌ అవుతాయని ఊహించలేదని అంటోంది ప్రియాంక జవాల్కర్‌.

`టాక్సీవాలా`తో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్‌(Priyanka Jawalkar). ఇటీవల `తిమ్మరుసు`తో ఆకట్టుకుంది. తాజాగా ఆమె `గమనం`(Gamanam)తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెల్లడించింది. తాను అందాల ఆరబోతకు సిద్ధమే అని తెలిపింది. సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కానున్న ఈ చిత్రంలో శ్రియశరన్‌,  శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌, నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రధారులు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా ప్రియంక ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 

`గమనం` చిత్రంలో నా పాత్ర పేరు ఝారా! ముస్లిం అమ్మాయి పాత్ర పోషించాను. నా పాత్రకు పెద్దగా డైలాగ్స్‌ ఉండవు. కేవలం కళ్లతోనే హావభావాలు పలికించాలి. అది కొంచెం కష్టంగా అనిపించింది. ఆ పాత్ర కోసం చాలా రిఫరెన్స్‌ తీసుకున్నా. నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మామూలుగా నేను కమర్షియల్‌ సినిమాలకే పనికొస్తానని, తెల్లగా ఉంటానని విలేజ్‌ పాత్రలకు వద్దని అంటారు. ఇలాంటి పాత్ర చేస్తే భవిష్యత్తులో నటనకు ప్రాధాన్యమున్న అవకాశాలు వస్తాయని చేశా. ఈ కథ వినగానే `వేదం` గుర్తొచింది. ఇక ఇళయరాజా గారు సంగీతం అనగానే ఇలాంటి అవకాశం రాదని ఓకే చెప్పేశా. చారు హాసన్‌ నటన గురించి చెప్పడానికి వయస్సు సరిపోదు.

`టాక్సీవాలా` సక్సెస్‌ను వాడుకోలేకపోయానని చాలా మంది అన్నారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధి రాతను ఎవరూ మార్చలేరు. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`, `తిమ్మరుసు` ఇంత హిట్‌ అవుతాయని ఊహించలేదు. `గమనం` కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నా. సెలెక్టెడ్‌ కథలతో సినిమాలు చేస్తే.. కెరీర్‌ స్లో అవుతుందనే భయం ఉంది. అలాగని వచ్చిన సినిమాలన్నీ చేసేసి అవి ఫ్లాపు అయితే నా పరిస్థితి ఏంటనే భయం కూడా ఉంటుంది. అందుకే నాకు కథ నచ్చితేనే ఒప్పుకుంటాను. అందరూ హీరోలతో చేయాలని ఉంది. హీరోతో సమానంగా పాత్రలు చేయాలని ఉంది. ఓ మంచి లవ్‌స్టోరీ కూడా. కథ డిమాండ్‌ చేేస్త ఎలాంటి పాత్ర చేయడానికైనా చేస్తాను. బోల్డ్‌ క్యారెక్టర్‌ చేయడానికైనా రెడీగా ఉన్నా.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?