రామాయణంలో ఆ పాత్రని ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిందా ? చివరికి రకుల్ కి దక్కిన అవకాశం

Published : Jun 12, 2025, 09:12 PM IST
Priyanka Chopra and Rakul Preet Singh

సారాంశం

నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంలో ఒక క్రేజీ పాత్రని ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం రామాయణం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లీక్డ్ ఫొటోస్ కూడా అంచనాలు పెంచేశాయి.  

శూర్పణఖ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ప్రియాంక చోప్రా 

ఈ చిత్రంలో రావణుడి చెల్లెలైన శూర్పణఖ పాత్ర కోసం మొదట ప్రియాంకా చోప్రాను ఎంపిక చేయాలని చిత్రబృందం అనుకుంది. కానీ ఆమె అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతో, ఈ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్‌కు లభించింది. శూర్పణఖ పాత్ర రామాయణంలో కీలక మలుపుకి కారణం అవుతుంది. ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశం రకుల్ కి దక్కడం.. ఆమె షూటింగ్ లో పాల్గొనడం జరిగిందట. 

రామాయణం రిలీజ్ డేట్ 

నిర్మాతలు గత సంవత్సరం నవంబర్‌లో అధికారికంగా పోస్టర్‌తో పాటు విడుదల తేదీలను ప్రకటించారు. రామాయణం పార్ట్ 1 దీపావళి 2026న విడుదల కానుండగా, రామాయణం పార్ట్ 2 దీపావళి 2027న విడుదలవుతుంది.

ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యాష్ నటిస్తున్నారు. అంతేకాక, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకయిగా లారా దత్తా, మండోదరిగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మొత్తంగా ప్రియాంక చోప్రా రామాయణం చిత్రంలో భాగం కావడం లేదు. అయితే ఆమె త్వరలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి రూపొందే SSMB 29 చిత్రంలో నటిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi కెరీర్ లో టాప్ 5 గ్రాసర్స్..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఆ మూవీని బీట్ చేసే సత్తా ఉందా ?
చిరంజీవి తో మాజీ మిస్ వరల్డ్ రొమాన్స్.. మెగా 158 మూవీ కోసం ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నిజమెంత?