ప్రియాంక చోప్రా బాధ్యతలు.. ఇల్లుకొని వారసున్ని ఇవ్వాలట!

Published : Sep 09, 2019, 11:09 AM ISTUpdated : Sep 09, 2019, 11:10 AM IST
ప్రియాంక చోప్రా బాధ్యతలు.. ఇల్లుకొని వారసున్ని ఇవ్వాలట!

సారాంశం

హాలీవుడ్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్ళాడిన అనంతరం అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు సినీ కెరీర్ ని ఒకే లెవెల్లో కొనసాగిస్తోంది. ఇక నెక్స్ట్ తన ముందు ఉన్న టార్గెట్స్ గురించి పిసి రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక స్టార్ హీరోయిన్ గా వెలగడం ఒక ఎత్తైతే.. హాలీవుడ్ స్క్రీన్ పై అదే స్పీడ్ తో మెరావడం మరొక ఎత్తు. హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. హాలీవుడ్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్ళాడిన అనంతరం అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు సినీ కెరీర్ ని ఒకే లెవెల్లో కొనసాగిస్తోంది. 

ఇక నెక్స్ట్ తన ముందు ఉన్న టార్గెట్స్ గురించి పిసి రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది.'నేను ప్రేమించే వారు నాతో ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటాను. నా భర్తతో ఉండడం నాకు చాలా సంతోషం. అయితే ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లో ఇల్లు కొనాలి. అలాగే ఒక బిడ్డకు జన్మనివ్వడం నా ముందు ఉన్న బాధ్యతలు. లాస్ ఏంజిల్స్ లో నిక్ తో కలిసి ఉండడం నాకు చాలా ఇష్టం' అని  ప్రియాంక వివరణ ఇచ్చింది. 

అలాగే తన జయాపజయాల గురించి వివరించిన ప్రియాంక ఒక స్ట్రాంగ్ కొటేషన్ ఇచ్చింది. అపజయం అనంతరం నువ్వు తీసుకునే కీలకమైన నిర్ణయమే నిన్ను విజయం సాధించేలా చేస్తుందని పిసి అందరికి స్పూర్తినిచ్చే విధంగా మాట్లాడింది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్