ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన స్టార్ హీరో!

By AN TeluguFirst Published Sep 9, 2019, 10:23 AM IST
Highlights

అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్‌ హరిఓం భాటియా. పంజాబ్ అమృత్ సర్ లో ఇండో కెనడియన్ అయిన హరిఓం బాటియా మరియు అరుణా బాటియా దంపతులకు 1967 సెప్టెంబర్ 9న జన్మించాడు. 

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నేడు 51వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ చెబుతూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం అక్షయ్ కి తన విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో అక్షయ్ ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ గా మారారు.

అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్‌ హరిఓం భాటియా. పంజాబ్ అమృత్ సర్ లో ఇండో కెనడియన్ అయిన హరిఓం బాటియా మరియు అరుణా బాటియా దంపతులకు 1967 సెప్టెంబర్ 9న జన్మించాడు. బాల్యం మొత్తం ముంబైలోని చాందినీ చౌక్ లో గడిపిన అక్కీ 18 ఏళ్ల వయసులో మార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువతో చదువు మానేసి బ్యాంకాక్ వెళ్లారు.

పగలంతా హోటల్ లో పని చేసి  రాత్రుళ్లు మార్షల్‌ ఆర్ట్స్‌లో కఠోర సాధన చేసేవాడు. బ్యాంకాక్ నుండి తిరిగొచ్చిన తరువాత అతని శిష్యులలో ఒకడైన ఓ ఫొటోగ్రాఫర్‌ మోడలింగ్ కోసం అక్షయ్ ఫోటోలను తీశాడు. అవి వర్కవుట్ కావడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

1987 లో సినిమా కెరీర్ ప్రారంభం కాగా, 90లో వచ్చిన 'ఖిలాడీ' సిరీస్ అతని కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పింది. యాక్షన్‌ హీరోగా ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ను అక్షయ్‌ కి కట్టబెట్టింది. 'ఖిలాడీ' సిరీస్‌లో ఏకంగా ఏడు చిత్రాలు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇక యాక్షన్‌ చిత్రాల్లో తన ఫైట్లతో అదరగొట్టిన ఖిలాడి తర్వాత కొంతకాలం వరుస ఫ్లాపులను చవిచూశాడు. ఆపై రూటు మర్చి కామెడీ కుమార్‌గా మారిపోయారు. 'హేరా ఫేరీ', 'హౌస్‌ఫుల్‌' సిరీస్, 'వెల్‌కమ్‌', 'సింగ్‌ ఈజ్‌ కింగ్‌' లాంటి చిత్రాల్లో విభిన్నమైన కామెడీతో వినోదాలు పంచాడు. ఇంకోవైపు స్పెషల్ ఛబ్బీస్, బేబీ, రుస్తుం లాంటి సీరియస్ సినిమాలతో కూడా మెప్పించాడు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్  తీసుకుంటున్న హీరోల్లో అక్షయ్ ముందంజలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలోనూ  చోటు సంపాదించుకున్నాడు. 2001లో రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాల కూతురు, నటి ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు అరావ్, కూతురు నీటారా. 

 

Happy birthday paaji!!!keep inspiring the way you do...learn so much from you...may this year brings u more and more happiness...loads love🤗🤗🙏🏻🙏🏻

— Maniesh Paul (@ManishPaul03)

 

click me!