Priyanka Chopra : ప్రియాంక మొహంపై రక్తపు మరకలు, కంగారులో ఫ్యాన్స్

Surya Prakash   | Asianet News
Published : May 19, 2022, 03:09 PM IST
Priyanka Chopra : ప్రియాంక మొహంపై రక్తపు మరకలు, కంగారులో ఫ్యాన్స్

సారాంశం

పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్‌పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. దాంతో  ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో అనుకుంటున్నారు. 


గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.   తాను ఎక్కడికి వెళ్లినా తనతోపాటే ఇండియా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరూ తక్కువ చేయకుండా ఉన్నతంగా ఎదుగుతూవస్తోంది. సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉండే ప్రీయాంక తాజాగా తన ఫ్యాన్స్ ఓ ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చింది.  

ఆ ఫోటోలో ప్రియాంక ముఖంపై మనం రక్తపు మరకల్ని గమనించవచ్చు. పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్‌పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. దాంతో  ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో అనుకుంటున్నారు. ఆమె అభిమానులు కూడా అదే అనుకుంటూ కంగారుపడుతున్నారు. అయితే ఆ ఫొటో క్రింద క్యాప్షన్ చదివితే కంగారుపడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది.  

వాస్తవానికి  ప్రియాంకకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ ఫోటో ఆమె షూటింగ్ సమయంలో తీసుకున్నది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. షూట్ నుంచి బ్రేక్ లభించడంతో, ఫేస్‌పై వేసుకున్న మేకప్‌తోనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. కింద ‘పనిలో క్లిష్టమైన రోజు’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇదీ.. ఆ ఫోటో వెనకున్న అసలు సంగతి! అయితే ప్రియాంక చోప్రా ఆ ఫోటో పెట్టడమే ఆలస్యం.. కింద క్యాప్షన్ చదవకుండానే ‘ఏం జరిగింది? ఎందుకు ఫేస్ ఇలా తయారైంది? ఏమైనా ప్రమాదం జరిగిందా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు ఫ్యాన్స్.. ఆతర్వాత క్యాప్షన్ చదివి.. రిలీఫ్ అవుతున్నారు.

ప్రియాంక ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్​ ప్రైమ్​ వీడియో సిరీస్​తో బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రియాంక మరో క్రేజీ ఆఫర్​ కొట్టేసింది. మార్వెల్​ సినిమాటిక్​ యూనివర్స్​ మూవీస్​లో నటించిన యాక్టర్​తో కలిసి స్క్రీన్​ షేర్ చేసుకోనుంది. అతనెవరో కాదు యాంట్​ మ్యాన్​, అవెంజర్స్:​ ఇన్ఫినిటీ వార్​, అవెంజర్స్:​ ఎండ్​గేమ్​ వంటి హిట్​ చిత్రాలతో పాటు ఫాల్కన్ అండ్​ ది వింటర్​ సోల్జర్​ వెబ్​ సిరీస్​తో ఆకట్టుకున్న ఆంథోనీ మాకీ. ఇతనితో కలిసి ఎండింగ్​ థింగ్స్​లో నటించనుంది ప్రియాంక. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్​ జేమ్స్​ కామెరూన్​ తెరకెక్కించిన యాక్షన్​ కామెడీ మూవీ 'ట్రూ లైస్'​ తరహాలో ఉండనున్న ఈ చిత్రానికి కెవిన్​ దర్శకత్వం వహిస్తున్నారు. నేర సామ్రాజ్యం నుంచి బయట పడాలనుకునే ఓ మహిళా కథలా ఉండనుందని చెప్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా