Project K: ‘ఎక్స్‌ లైఫ్‌’ ఎడిట్ చేయండి...ప్రభాస్ సినిమాకు వర్క్ చేయండి

Surya Prakash   | Asianet News
Published : May 19, 2022, 01:43 PM IST
Project K: ‘ఎక్స్‌ లైఫ్‌’ ఎడిట్ చేయండి...ప్రభాస్ సినిమాకు వర్క్ చేయండి

సారాంశం

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ ప్రధాన పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌ ఈ షూటింగ్‌ సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు.


నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ ప్రధాన పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌ ఈ షూటింగ్‌ సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు. ప్రభాస్, ఓ బాలీవుడ్‌ యాక్టర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం వేసిన మూడు ప్రధాన సెట్స్‌లో ప్రస్తుతం టాకీ పార్ట్‌ షూటింగ్‌ జరిగింది. ఈ నెల 10 వరకు ఈ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. 

ఇక ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎడిటింగ్ డిపార్టమెంట్ లో పనిచేసేందుకు నాగ్ అశ్విన్ ఓ ఆఫర్ ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువగా కొత్తవారికి ఛాన్స్‌ ఇచ్చేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు క్యాస్ట్ కాలింగ్ అంటూ ఆడిషన్స్‌కు పిలుపునిచ్చిన ప్రాజెక్ట్ కే.. తాజాగా మరోసారి టాలెంట్‌ ఉన్న వారిని తమ సినిమాకు పనిచేసేందుకు అవకాశం కల్పించింది.

నాగ్ అశ్విన్ గత సంవత్సరం నెట్ ప్లిక్స్ కు  ‘ఎక్స్‌ లైఫ్‌’ అనే ఎపిసోడ్ ను డైరక్ట్  చేసారు. ఆ  ఎపిసోడ్ చూసి...దాన్ని కట్ చేసి ఇంట్రస్టింగ్ ప్రోమోలా రెండు నిముషాలకు డిజైన్ చేస్తే వారిలో నచ్చినవారికి తమ సంస్ద వైజయంతిలో ఎడిటింగ్ డిపార్టమెంట్ లో అవకాసం లభిస్తుందని చెప్పారు. 

ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?
2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?