
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ స్టార్ నిక్ జానస్ ను పెళ్ళాడి.. హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది స్టార్ బ్యూటీ. హాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధిస్తూ.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది ప్రియాంక. రీసెంట్ గా హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్ తో అలరించింది ప్రియాంక చోప్రా.
ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్ అనే వెబ్ మూవీతో.. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్తో బిజీగా ఉంది. ఇటు బాలీవుడ్ మూవీస్ మీద కూడా ఓ కన్నేసి ఉంచింది ప్రియాంక. ఇక ఇది ఇలా ఉంటే ఉంటే ప్రియాంక తన ఫేవరెట్ కార్లలో ఒకటైన రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారును అమ్మేసిందంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. తాను ఎంతో ఇష్టంగా ఈ కారును కొనుక్కుంది ప్రియాంక చోప్రా.
ఇక తను అంత ఇష్టంగా కొన్న కారును ఎందుకు ఆమె అమ్మసిందో అని అభిమానుల మధ్య ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే ప్రియాంక హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్ళి చేసుకున్న తరువాత ప్రియాంక అమెరికాలోనే సెటిలైపోయింది. దీంతో ఇక్కడ గ్యారేజ్‌లో తన కారు చాలాకాలంగా ఖాళీగా ఉంటోందట. దాన్ని వాడటానికి లేక.. తన కారును అమ్మేసిందంట ప్రియాంక.
ఈ కారును బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఆమె అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ కారు వాల్యూ కూడా అక్షరాలా రెండున్నర కోట్లు. ఇక ప్రియాంక ఖాతాలో మరో రికార్డ్ కూడా ఉంది. బాలీవుడ్ లో ఈ రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారు కొన్న తొలి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రానే కావడం విశేషం.