
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఆసుపత్రి పాలయ్యాడు. ఏకంగా సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇది. ఈ వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు `రాధేశ్యామ్` ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఆయన ఆసుపత్రి పాలు కావడం ఏంటని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకి ప్రభాస్‌కి ఏమైందనేది చూస్తే.
ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. `రాధేశ్యామ్`(Radheshyam) విడుదల కాగా, `సలార్`, `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణలో ఉన్నాయి. `ఆదిపురుష్` పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే `సలార్`(Salaar) భారీ యాక్షన్ మూవీ. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌కి గాయమైందట. షూటింగ్‌లో గాయాలపాలు కావడంతో ఆపరేషన్ అవసరమైందని తెలుస్తుంది. `రాధేశ్యామ్` విడుదలై ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో రిలాక్స్ అయిన ప్రభాస్, పెండింగ్‌లో ఉన్న తన సర్జరీని పూర్తి చేసుకోవాలని భావించారట.
అందులో భాగంగా తాజాగా ఆయన స్పెయిల్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ అనంతరం డాక్టర్లు ప్రభాస్‌ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్నడార్లింగ్ ఫాన్స్ ఆందోళన చెందుతున్నాయి. అయితే ఆందోళన పడాల్సింది లేదనే వార్త రావడంతో ఊపిరి తీసుకున్నారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుని, తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ `సలార్`, `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణలు పూర్తి చేయబోతున్నారు. మరోవైపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మారుతి చిత్రాన్ని పట్టాలెక్కీయబోతున్నారు.
అలాగే `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. ప్రభాస్ ఇటీవల రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` చిత్రంలో నటించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ఈ సినిమా గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనతో రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, కృష్ణంరాజు కూతురు ప్రసీద నిర్మాతలుగా వ్యవహరించారు.