
ది కాశ్మీర్ ఫైల్స్ ఒక చిన్న సినిమా వికేక్ అఘ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈమూవీ 1990లో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన అరాచకాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. అరాచక శక్తుల చేతుల్లో నలిగి.. అక్కడ బాధలు తట్టుకోలేక భారీగా వలస వెళ్లిన పండిట్ల గుండెకోతను ప్రతిబింబించేలా ఉన్న కశ్మీర్ ఫైల్ సినిమా దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, చిన్మయ్ మండ్లేకర్, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా, ఓ చిన్న సినిమాగా వచ్చిన కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కశ్మీరీ పండిట్ల గుండెకోతను దర్శకుడు తెరకెక్కించిన విధానం, నటీనటుల ప్రతిభ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.
ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుండగా అప్పుడే 100 కోట్ల క్లబ్ లో చేరింది మూవీ. 7 రోజుల్లో 106.80 కోట్లు వసూలు చేసి.. కమర్షియల్ సినిమాలకు దీటుగా నిలిచింది. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా రకరకాలు గా స్పందిస్తున్నారు.
మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏకంగా ఈసినిమాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ చూసి టీమ్ ను అభినందించారు. అటు బీజేపి లీడర్స్.. తో పాటు ముఖ్యమంత్రులు.. మంత్రులు కూడా ఈసినిమాను చూసి ప్రశంసలు అందించారు. కొన్ని బీజేపి పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వగా..అస్సాం ఏకంగా ఈసినిమాను చూడటానికి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది.
అటు బిజేపీకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా కూడా ఈ సినిమాపై స్పందించారు. బాలీవుడ్ పాపాలు కడిగిపారేసే సినిమా ఇది అంటూ వీడియో రిలీజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై సోషల్ మీడియాలో స్సందించారు. నాలుగైదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు సాధించిందని వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను చూపిస్తూ.. రాధేశ్యామ్ కు చురకలు అంటించారు వర్మ.
అందులో కొన్ని నెగెటీవ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ఈసినిమా పాత గాయాలు మాన్పుతుందా..? లేక రెచ్చగొడుతుందా..? లేక ద్వేషం అనే విత్తనాలు నాటుతుందా చూద్దాం అంటూ డిఫరెంట్ గా స్పందించారు. ఇక ఈసినిమాపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం.. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ కు వై కేటగిరి భద్రతను కల్పించినట్టు తెలుస్తోంది.