
ఏ దేశం వెళ్లినా మన దేశ ఆచారాలు.. సంప్రదాయాలు మర్చిపోకుండా పాటించడం కొంతమందికి మాత్రమే సాధ్యం. అందులో బాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంకచోప్రా (Priyanka Chopra) ముందున్నారు.
తాను మాత్రమే కాకుండా.. విదేశీయుడైన తన భర్త నిక్ జోనస్(Nick Jonas) తో కూడా పూజలు చేయిస్తుంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఎక్కడికి వెళ్లినా.. ఏదేశంలో ఉన్న మన సంప్రదాయాలు మర్చిపోకూడదు అని నిరూపిస్తుంది స్టార్ హీరోయిన్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగి హీరోయిన్ గా తనదైన మార్క్ చూపించుకుంటుంది ప్రియాంక(Priyanka Chopra). ఎంత ఎత్తుకు ఎదిగినా.. భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తెలిపింది.
తాను చెప్పింది ఆచరణలో చూపించింది ప్రియాంక. ఏ పండగ వచ్చినా..ట్రెడిషనల్ డ్రెస్సుల్లో దర్శనం ఇస్తూ.. భార్యా భర్తలిద్దరూ.. సంప్రదాయంగా కనిపిస్తుంటారు. ఇక రీసెంట్ గా మహాశివరాత్రి సందర్భంగా లాస్ ఏంజిల్స్‌లోని తమ ఇంట్లో పరమశివున్ని కొలిచారు ప్రియాంక(Priyanka Chopra), నిక్ జోనాస్ జంట. మార్చి 1 మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పూజ చేశారు ఈ హాలీవుడ్ జంట.
ప్రియాంక చోప్రా(Priyanka Chopra), నిక్ జోనాస్(Nick Jonas) కలిసి సంప్రదాయ దుస్తుల్లో.. శివుని విగ్రహం ముందు కూర్చొని పూజ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో శేర్ చేసింది ప్రియాంక. తన ఇన్‌స్టా స్టోరీలో మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ... హరహర మహాదేవ్. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ అంటూ.. శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది.
ఈ ఫొటోలో ప్రియాంక (Priyanka Chopra) గులాబీ రంగు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, తెల్లటి కుర్తా పైజామాలో నిక్ జోనాస్(Nick Jonas) కనిపించాడు. ప్రియాంక కజిన్ దివ్య జ్యోతి కూడా ఈ వేడుకల్లో పాల్గోంది. అయితే ఈ ఫోటో చూసిన ఇండియన్ నెటిజన్లు.. ప్రియాంకకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పొగడ్తలతో మంచెత్తుతున్నారు. విదేశీయుడిని పెళ్లి చేసుకున్నా.. మన సంప్రదాయాలు మర్చిపోకుండ పాటిస్తున్నందకు అభినందిస్తున్నారు.