హీరోగా గాలి జనార్థన్ రెడ్డి తనయుడి ఎంట్రీ.. భారీ యెత్తున ప్లానింగ్...

Published : Mar 02, 2022, 07:10 AM ISTUpdated : Mar 02, 2022, 07:23 AM IST
హీరోగా గాలి జనార్థన్ రెడ్డి తనయుడి ఎంట్రీ.. భారీ యెత్తున ప్లానింగ్...

సారాంశం

ఒకప్పుడు క‌న్న‌డ రాజ‌కీయాల‌ను శాసించి.. బ‌ళ్లారి ప్రాంతంలో తిరుగు లేని రాజకీయ నేతగా మైకింగ్ కింగ్ గా వెలుగు వెలిగిన నేత గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhan Reddy). ఇప్పుడు తన తనయుడిని హీరో గా గ్రాండ్ లాంఛింగ్ చేయబోతున్నాడు.

ఒకప్పుడు క‌న్న‌డ రాజ‌కీయాల‌ను శాసించి.. బ‌ళ్లారి ప్రాంతంలో తిరుగు లేని రాజకీయ నేతగా మైకింగ్ కింగ్ గా వెలుగు వెలిగిన నేత గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhan Reddy). ఇప్పుడు తన తనయుడిని హీరో గా గ్రాండ్ లాంఛింగ్ చేయబోతున్నాడు.

అక్ర‌మ మైనింగ్ తో అవినీతి ముద్ర వేయించుకుని చాలా కాలం జైలు జీవితం గడిపి.. ప్రస్తుతం దాదాపుగా అజ్ఞాత వాసం చేస్తున్న కన్నడ కుభేరుడు.. క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి(Gali Janardhan Reddy). ప్రస్తుతం ఆయన తనయుడు కిరీటి(Kireeti) హీరోగా ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియలో  హ‌ల్ చ‌ల్ చేస్తోంది. లెక్క‌లేనంత సంప‌ద‌ను వెన‌కేసి.. అందరిని షాక్ కి గురిచేసిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి.. తన కూతురు  పెళ్లి ఏ రేంజిలో చేశాడో అందరూ చూశారు. ఇక అంతకు మించి అన్నట్టుగా  ఇప్పుడు గాలి కుమారుడి తెర‌గేంట్రం కూడా ఓ రేంజిలో జరగబోతున్నట్టు తెలుస్తోంది.  

గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy) తనయుడి ఎంట్రీ కనుక.. భారీబడ్జెట్ ను పెట్టబోతున్నారు. దీనికి తగ్గట్టు గా స్టార్ టీమ్ ను కూడా సెలక్ట్ చేసుకున్నారు గాలి ఫ్యామిలీ.. టాలీవుడ్‌లో ప్ర‌ముఖ నిర్మాత‌గా ఎదిగిన సాయి కొర్ర‌పాటి త‌న వారాహి సంస్థ ద్వారా గాలి కిరీటిని హీరోగా ప‌రిచయం చేస్తున్నార‌. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు  క‌న్న‌డ నాట సూప‌ర్ హిట్ అయిన మాయాబ‌జార్ సినిమాను డైరెక్ట్ చేసిన యంగ్అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈమూవీని తెరకెక్కించబోతున్నారు.  

అంతే కాదు ఈసినిమాకు  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. త‌న‌కంటూ ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న దేవీశ్రీ ప్ర‌సాద్  స్వ‌రాలు స‌మ‌కూర్చబోతున్నారు. బాహుబ‌లి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన సెంథిల్ కుమార్ ఈమూవీకి  మెరామన్‌గా ప‌నిచేయబోతున్నారు.  స్టంట్స్ మాస్టర్ గా.. యాక్షన్ సీన్స్ బాధ్యతలను పీట‌ర్ హెయిన్స్ కు అందించారు టీమ్. ఈ నెల 4న బెంగ‌ళూరులో అట్ట‌హాసంగా గాలి కిరీటి చిత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

 తెలుగుతో పాటు క‌న్న‌డలోనూ ఒకేసారి ఈ సినిమాన తెర‌కెక్కిస్తున్నారు. ఇండస్ట్రీ వైపు రావాలి అనుకోవడంతోనే గాలి కిరీట్ రెడ్డి మన దేశంతో పాటు.. విదేవాలో కూడా దీనికి సంబధించిన ట్రైయినింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. యాక్టింగ్ తో పాటు డాన్స్, స్టంట్స్.. డాన్స్ లాంటి వాటిలో హాలీవుడ్ రేంజ్ లో ప్రిపేయిర్ అయినట్టు సమాచారం. ఇప్పటికే కన్నడ నాట మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ లాంటి వారు భారీ స్థాయిలో లాంచ్ అయ్యి.. కలిసి రాక సైలెంట్ అయ్యారు. మరి కిరిటి రెడ్డి ఎలా మెప్పిస్తాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్