
అమెరికా కోడలు ప్రియాంకా చోప్రా పెళ్లి తరువాత హాలీవుడ్ పైనే దృష్టిసారించింది. 2018లో అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న ఆమె, న్యూయార్క్ సిటీలో కాపురం పెట్టారు. అక్కడే కోట్లు వెచ్చించి ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రెండు భారీ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.
వాటిలో మ్యాట్రిక్స్ ఒకటి కావడం విశేషం. అలాగే టెక్స్ట్ ఫర్ యు అనే మరో ఇంగ్లీష్ మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ మూవీలో భర్త నిక్ జోనాస్ చిన్న రోల్ చేయడం విశేషం. బాలీవుడ్ నుండి హాలీవుడ్ లో పాగా వేసిన ప్రియాంకా అక్కడ వరుస అవకాశాలు అందుకోవడం విశేషం అని చెప్పాలి.
కాగా సినిమాలు, పాత్రల ఎంపిక విషయంలో తన దృష్టి కోణం మారిందంటూ ప్రియాంక కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొన్నాళ్లుగా ప్రపంచ సినిమా అనేక మార్పులకు గురైందని ఆమె తెలిపారు. గతంలో ఒక సినిమా చేస్తే అది విజయం సాధిస్తుందో లేదో... అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం వదిలేశాను. ప్రేక్షకులకు నచ్చుతుంది అనిపిస్తే చూపించడానికి సిద్ధం అని ప్రియాంక అన్నారు.