దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా హవా నడిపించింది విజయశాంతి.. హీరోయిన్‌గా కెరీర్ ముగిశాక.. లేడీఓరియెంటెడ్ చిత్రాలతోనూ తన ప్రత్యేకను చాటుకున్నారామె.. ఆమె లీడ్‌రోల్ చేసిన ఓసేయ్ రాములమ్మ.. ఎంత పెద్దహిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. ఆ సినిమాతోనే ఆమె లేడీ అమితాబ్ అనే పేరు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత అదే తరహా సినిమాలు చాలి చేశారామె..
లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్, రాములమ్మగా ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నటి విజయశాంతి. రోయిన్‌గా మొదలై.. 'మగరాయుడు'గా మారి తన క్యారెక్టర్ పేరు మీదే సినిమాలు రూపొందించే స్థాయిని ఆమె సొంతం చేసుకుంది. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా సందడి చేశారు. ఆ తరువాత ఆమె లేడీ ఒరియెంటెడ్ చిత్రాలైన ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’వంటి చిత్రాల్లోనూ నటించిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆమె ఎన్నో సక్సెస్‌లు, అవార్డులు అందుకున్నారు. రాజకీయాలంటూ కొంతకాలం పాటు సినిమాకి దూరమైనప్పటికీ, ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు'తో రీ ఎంట్రీ ఇచ్చి.. మరోసారి తన నటనతో అందరినీ మెప్పించడమే కాకుండా.. ఆ సినిమా సక్సెస్‌కు తన వంతు పాత్రను పోషించారు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయం తర్వాత ఆమెను చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ముందుకొచ్చారు.
అయితే రాజకీయాల్లో కొన్నసాగుతున్న ఆమె, సినీ జీవితాన్ని కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకొన్నారు. తనను సంప్రదించిన వారందరికీ `నో` చెప్పటమే కాకుండా... `ఇకపై సినిమాలు చేయన`ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించారు. అయితే తాజాగా విజయశాంతిని ఓ పాత్ర ఆకర్షించినట్టు సమాచారం. కానీ ఆమె నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది.
విజయశాంతి కోసం ప్రతిమా ఫిల్మ్స్ ఓ సరికొత్త పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసి ఒప్పించారని తెలుస్తోంది. ఈ బ్యానర్ గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో `భారతరత్న` సినిమాను నిర్మించింది ప్రతిమా ఫిల్మ్స్ సంస్థ. ఇప్పుడు అదే స్పూర్తితో తాజాగా ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేయించిందట. దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్‌గా ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. విజయశాంతితో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా కశ్మీర్‌లోనే ఉంటుందట.
ఈ కథ తన ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని, ఈ సినిమా చేయాలని విజయశాంతి అనుకుంటున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే బయటకు రాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాలంటే కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.