స్టార్ హీరోయిన్ ని చంపాలనుకున్నాడట!

Published : Mar 28, 2019, 12:58 PM ISTUpdated : Mar 28, 2019, 12:59 PM IST
స్టార్ హీరోయిన్ ని చంపాలనుకున్నాడట!

సారాంశం

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. తన భర్త నిక్ తో కలిసి అమెరికాలోనే 
జీవిస్తోంది. ఇది ఇలా ఉండగా.. ప్రియాంకకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఎంటీవీ రోడీస్ కి చెందిన ఒక కంటెస్టంట్ ప్రియాంకని చంపేయాలనుందనిచెప్పడం అక్కడున్న వారందరినీ షాక్ కి గురి చేసింది. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోన్న నేహా ధూపియాకు ఒక కంటెస్టంట్ ప్రియాంకతో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించాడు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల రోడీస్ ఆడిషన్స్ జరిగాయి. వీటిలో పాల్గొన్న సారంగ్ తన దరఖాస్తులో ప్రియాంకా చోప్రాని చంపేయాలనుకుంటున్నట్లు రాశాడు. అది చూసిన నేహా ఎందుకు అలా అనుకుంటున్నావని కంటెస్టంట్ సారంగ్ ని ప్రశ్నించింది.

దానికి అతడు బదులిస్తూ.. ''గతంలో మేమంతా స్టేజ్ పై బ్యాకప్ డాన్సర్ గా ఉన్నప్పుడు ప్రియాంక మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టేది. అప్పటివరకు మేము రిహార్సల్స్ చేసిన తరువాత చివరి నిమిషంలో స్టెప్స్ మార్చేసేది. కొన్ని డిమాండ్లు కూడా చేసింది. దీంతో లంచ్ బ్రేక్ కూడా లేకుండా ఉదయం నుండి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదని, ఆమెకి ఎదురుచెప్పలేక ఇబ్బందులు పడ్డామని'' చెప్పుకొచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు