అప్పటి చిరంజీవి ఫార్ములానే ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫాలో అవుతున్నాడా?.. ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పుడు సినిమాలపై యంగ్‌ హీరో ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే జనం ఆదరిస్తున్నారని, అందులోనూ కామన్‌ మ్యాన్‌ కథలకు ప్రయారిటీ ఇస్తున్నారని, అలాంటి చిత్రాలనే చూసేందుకు ఇష్టపడుతున్నారని `పుష్ప2`, `లక్కీ భాస్కర్‌` అలాంటి కోవకు చెందిన సినిమాలే అని వెల్లడించారు. అయితే ఒకప్పుడు చిరంజీవి ఇలాంటి సినిమాలే చేసి విజయాలు అందుకున్నార`ని తెలిపారు. 
 

priyadarshi interesting comments on chiranjeevi rajini allu arjun at Sarangapani Jatakam promotions in telugu arj

ప్రియదర్శి మెయిన్‌ లీడ్‌ `సారంగపాణి జాతకం` మూవీ రూపొందింది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. ఈ శుక్రవారం(ఏప్రిల్‌ 25)న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియదర్శి మాట్లాడుతూ  జాతకాలపై ఓపెన్‌ అయ్యారు. ``సారంగపాణి జాతకం` చిత్రంలో చూపించినట్టుగా కాదు కానీ.. నేను కొంత నమ్ముతాను. ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు.

Latest Videos

మంచి సినిమాను చేయాలని ప్రయత్నిస్తాం. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ బిజినెస్ పరంగా, థియేటర్ల పరంగా అన్నీ లెక్కేసుకుని ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం` అని తెలిపారు. 

కేవలం నవ్వుల కోసమే `సారంగపాణి జాతకం` 

`జాతకాలు నమ్మాలి అని కానీ నమ్మకూడదు అని కానీ మేం చెప్పం. కానీ ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తాం. ఏ సైడ్ తీసుకుని మాత్రం కథను చెప్పలేదు. ప్రస్తుతం నవ్వించడం అనేది చాలా కష్టమైన పని. ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.

ఇలాంటి ఓ పాత్రను ఇంత వరకు నేను చేయలేదనిపిస్తోంది. ఇది చాలా కొత్తగా ఉండబోతోంది. ఈ చిత్రం, అందులోని నా పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను` అని అన్నారు. ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ ప్యాషన్‌ ఉన్న మేకర్స్ అని తెలిపారు.  

చిరంజీవి, రజనీ కాంత్‌ చేసిందే బన్నీ చేస్తున్నారు..

మన ఇండస్ట్రీలో యాక్షన్ హీరోలున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలకు మంచి కలెక్షన్స్ కూడా వస్తుంటాయి. కానీ నాని  ‘దసరా‘ చేశారు. ఆ వెంటనే ‘హాయ్ నాన్న‘ అని కూడా చేశారు. అవి రెండు హిట్లే అయ్యాయి. ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్ , బాలకృష్ణ అదే ఫార్మాట్‌ను అనుసరించారు. అన్ని రకాల చిత్రాలను చేసి మెప్పించారు.

నేను కూడా అలానే చేయాలని  అనుకుంటున్నాను. ప్రస్తుతం జనాలు కంటెంట్ ఉన్న చిత్రాల్నే ఎంకరేజ్ చేస్తున్నారు. కామెన్ మెన్ కథల్నే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లక్కీ భాస్కర్, పుష్ప వంటి చిత్రాల్లో కామన్ మెన్ హీరోగా మారుతాడు. అప్పట్లో చిరంజీవి గారు కూడా అదే ఫార్మాట్‌లో చాలా చిత్రాలు చేసి అందరినీ మెప్పించారు. 

కొత్త ప్రాజెక్ట్ ల గురించి ప్రియదర్శి..

ఏషియన్ సినిమాస్‌లో ‘ ప్రేమంటే‘ అనే సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాను. గీతా ఆర్ట్స్‌లో బన్నీ వాస్ గారి నిర్మాణంలో ‘మిత్రమండలి‘ అనే మరో ప్రాజెక్టుని చేస్తున్నాను. ఇంకా కొన్ని కథలు వింటున్నాను. బలమైన పాత్రలుండే సినిమాల్ని ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను.
 

vuukle one pixel image
click me!