అలా కొట్టి ఇలా పడేస్తోంది...ఎవరీ పిల్ల

Published : Feb 12, 2018, 11:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అలా కొట్టి ఇలా పడేస్తోంది...ఎవరీ పిల్ల

సారాంశం

అలా కొట్టి ఇలా పడేస్తోంది...ఎవరీ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆ పిల్ల సంగతి జనాలకు ఎలా తెలుస్తుంది చెప్పండి? కానీ ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు. ఇందుకు కారణం ఓ చిన్న వీడియో అంతే.

తన ప్రియుడిని ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తున్న పిల్ల ఈ వీడియోలో కనిపిస్తుంది. ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఇది. ఈ వీడియోలో ప్రియా వారియర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి జనాలు మత్తులో పడిపోతున్నారు. ప్రేమలో ఎంతటి అద్భుతమైన ఫీల్ ఉంటుందో.. భలేగా చూపించేసింది ఈ అమ్మాయి. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్ను కొడుతూ.. మూతి వంకర్లు తిప్పుతూ ప్రియా సూపర్బ్ గా కనిపించడమే.. ఈ వీడియోకు ఇంత క్రేజ్ రావడానికి కారణం. ఇదే సినిమా.. ఎవరీ పిల్ల అంటూ జనాల్లో కుతూహలం విపరీతంగా పెరిగిపోయింది.

ఒరు అడార్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ మలయాళ చిత్రంతో ఈ చిన్నది సినిమాల్లోకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా మార్చ్ 3న విడుదల కానుండగా.. ఈ సినిమాకి సంబంధించి మలరాయ పూవీ అంటూ సాగే ఓ పాటకు ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఈ చిన్నది ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ అయిపోయాయి. ఒక్కసారిగా జనాలకు ఈ పిల్ల.. ఆ పాట.. సినిమా కూడా ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు