మామా అల్లుళ్లయినా మలయాళీ పిల్లకి హిట్ ఇస్తారా ?

Published : Feb 23, 2023, 11:22 AM ISTUpdated : Feb 23, 2023, 11:41 AM IST
మామా అల్లుళ్లయినా మలయాళీ పిల్లకి హిట్ ఇస్తారా ?

సారాంశం

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఒక సన్నివేశంలో కన్నుగీటుతూ ప్రియా వారియర్ ఇచ్చిన హావభావాలు దేశం మొత్తాన్ని ఫిదా చేశాయి. 

అది ప్రియా వారియర్ కి క్రేజ్ తెచ్చిపెట్టడంలో ఉపయోగపడింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోవడం ప్రియా వారియర్ కి అంత సులభం కావడం లేదు. తనకున్న వింక్ బ్యూటీ క్రేజ్ తో ప్రియా వారియర్ కి నితిన్ సరసన చెక్, తేజ సజ్జ సరసన ఇష్క్ చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ రెండు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. 

దీనితో ప్రియా వారియర్ ప్రస్తుతం మరో ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోందట. తాజాగా ప్రియా వారియర్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం వినోదయ సిత్తం రీమేక్ ప్రారంభం అయింది. 

ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దేవుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు. తేజుకి హీరోయిన్ గా బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఆల్రెడీ ఫిక్స్ అయింది. అయితే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్ అవసరం అట. ఆ పాత్రలో నటించే అవకాశం ప్రియా వారియర్ కి దక్కినట్లు తెలుస్తోంది. మరి హీరోయిన్ కాని పాత్రకు ఈ ముద్దుగుమ్మ ఒకే చెప్పిందా  లేదా అనేది చూడాలి. ఈ చిత్రంలో నటిస్తే మాత్రం ప్రియా వారియర్ తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ కావచ్చు అని అంటున్నారు. 

ఈ చిత్రాన్ని తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించబోతున్నారు. తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు