ఆ తర్వాతే ప్రభాస్ - మారుతీ సినిమా ప్రకటన? అప్పటి వరకు సేమ్ ప్లాన్!

By Asianet News  |  First Published Feb 23, 2023, 11:20 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - మారుతీ సినిమాపై ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఓ పక్కా అనౌన్స్ మెంట్ లేకుండానే షూటింగ్ కొనసాగుతుండటంతో.. ఇంకెప్పుడు ప్రకటిస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాజాగా ఓ అప్డేట్ అందింది.
 


భారీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas). చివరిగా రాధే శ్యామ్ తో ఫ్యాన్స్ ను అప్సెట్ చేసిన డార్లింగ్.. అప్ కమింగ్ ఫిల్మ్స్ తో అదిరిపోయే ట్రీట్ అందించబోతున్నారు. కేవలం ఆరునెలల్లోనే మూడు చిత్రాలను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయడంతో... ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. ఫ్యాన్స్ కు ఇదొక గుడ్ కావడం విశేషం.. ఇదిలా ఉంటే ప్రభాస్ - మారుతీ (Maruthi) కాంబినేషన్ లో ఓ  సినిమా తెరకెక్కుతున్నట్టు ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఓ పాతకాలపు థియేటర్ సెట్ లో షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. వాటిని బలపర్చేందుకు షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫొటోలు కూడా లీక్ అవుతున్నాయి.

మారుతీ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్ హీరోగా క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఎలాంటి ప్రకటన లేకుండానే ప్రారంభించారు. మీడియాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్నారంట చిత్ర యూనిట్. ఓ పక్కా షూటింగ్ జరుగుతున్నా సినిమాపై అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు నిన్న భారీ ఎత్తున ట్వీటర్ లో ప్రభాస్ - మారుతీ సినిమాను ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos

ఇక తాజాగా సినిమాను ప్రకటించకపోవడంపై ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ (Adipurush) ఆలస్యం కావడంతో ప్రభాస్ మిగిలిన సినిమాల నుంచి కూడా అప్డేట్స్ నిలిపివేస్తున్నారంట. ఇక మొన్న శివరాత్రికి మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అంతకముందే ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చింది. ఇది తప్పా ప్రభాస్ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ అందలేదు. ఈక్రమంలో కనీసం అనౌన్స్ మెంట్ కూడా లేకుండా ప్రభాస్- మారుతీ సినిమా షూటింగ్ కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది. 

జూన్ 16న ‘ఆదిపురుష్’ రిలీజ్ అయ్యాకే మారుతీ సినిమాను ప్రకటిస్తారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. కానీ అప్పటి వరకు షూటింగ్ ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు. మరోవైపు సినిమా నుంచి త్వరలో ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకోసం మొన్న రోజంతా ప్రభాస్ తో ఫొటోషూట్ కూడా చేయించారని టాక్. చూడాలి మరీ మున్ముందు అప్డేట్ ఎలా వస్తుందో.. ఇక సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని తెలుస్తోంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రాధే శ్యామ్ లో నటించిన రిద్దీ కుమార్ కూడా నటిస్తోందని అంటున్నారు. 

click me!