
చాలా మంది హీరోయిన్లు తమ లైఫ్ లో క్రష్ ల గురించి రివీల్ చేస్తుంటారు. తమిళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ప్రియా భవాని శంకర్. ప్రియా భవాని శంకర్ కూడా తన క్రష్, లవ్ స్టోరీ రివీల్ చేసింది. తన లవ్ స్టోరీ జిమ్ సెంటర్ లో జరిగింది అని ప్రియా భవాని తెలిపింది.
కొన్నేళ్ల క్రితం రోజు నేను రోజు జిమ్ వెళ్లేదాన్ని. జిమ్ లో ఒక అబ్బాయిని చూసి ఆకర్షణకు గురయ్యా. ఎవరిని డిస్ట్రబ్ చేయకుండా తనపని తాను చేసుకుని వెళ్ళేవాడు. జిమ్ కి వెళ్లి రోజూ ఆ అబ్బాయిని చూసేదాన్ని. ఆ అబ్బాయికి నేను సైట్ కొడుతున్నాననే విషయం అతడికి తెలియదు.
అతడి ప్రవర్తన నన్ను బాగా ఆకట్టుకుంది.ఏడాది తర్వాత జిమ్ మారడంతో ఆ అబ్బాయిని మిస్ అయ్యా. ఏడాదిలో ఆ అబ్బాయి ఒక్కసారి కూడా నా వంక కన్నెత్తి కూడా చూడలేదు. సమాజంలో హుందాగా మర్యాదగా మెలిగే అబ్బాయిలు అంటే నాకు ఇష్టం.
తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో బీఎండబ్ల్యూ కారులో తిరిగే అబ్బాయి కంటే.. సొంత సంపాదనతో బైక్ పై తిరిగే అబ్బాయిలంటేనే నాకు ఇష్టం ఉంటుంది. అలాంటి వ్యక్తులనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రియా భవాని తెలిపింది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ శంకర్, కమల్ హాసన్ ల ఇండియన్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది.