`సలార్‌` నుంచి పృథ్వీరాజ్‌ ఫస్ట్ లుక్‌.. అతి భయంకర రూపం..

Published : Oct 16, 2022, 10:25 AM IST
`సలార్‌` నుంచి పృథ్వీరాజ్‌ ఫస్ట్ లుక్‌.. అతి భయంకర రూపం..

సారాంశం

ప్రభాస్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `సలార్‌`. `కేజీఎఫ్‌` తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలోని పృథ్వీరాజ్‌ లుక్‌ విడుదలయ్యింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. 

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` నుంచి క్రేజీ సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఇందులోని పృథ్వీరాజ్‌ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. నేడు(అక్టోబర్‌ 16) పృథ్వీరాజ్‌ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో పృథ్వీరాజ్‌ `వర్ధరాజా మన్నార్‌` పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పాత్ర అతి భయంకరంగా, క్రూరంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్‌ని చూస్తుంటే తెలుస్తుంది. 

తాజా ఫస్ట్ లుక్‌లో పృథ్వీరాజ్‌ ముక్కుకి పుడక, మెడలో వెండి కడీలు ముఖంపై గాట్లు, కళ్లల్లో కోపం, క్రూరత్వం, నుదుటిపై పొడువైన బొట్టు, చెవికి రింగులతో అత్యంత భయంకరంగా కనిపిస్తున్నారు. ప్రభాస్‌కి దీటైన విలన్‌గా పృథ్వీరాజ్‌ కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రభాస్‌ `సలార్‌`గా కనిపించబోతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ మెయిన్‌ విలన్‌ పాత్రని పోషిస్తున్నట్టు సమాచారం. `సలార్‌`లోని పృథ్వీరాజ్‌ లుక్‌ ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ అని చెప్పొచ్చు. అదే సమయంలో డార్లింగ్‌ ఫ్యాన్స్ కిది పెద్ద సర్‌ప్రైజ్‌ అనే చెప్పాలి. 

ప్రభాస్‌ హీరోగా, పృథ్వీరాజ్‌, జగపతిబాబు నెగటివ్‌ రోల్స్ చేస్తున్న `సలార్‌`లో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ప్రభాస్‌ లుక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటికి విశేషమైన స్పందన లభిస్తుంది. కార్మికుల నాయకుడు సలార్‌గా ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్ డేట్లు కోరుకుంటున్న అభిమానులకు అప్‌డేట్‌ సర్‌ప్రైజ్‌ అనే చెప్పాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?