
ప్రేమిస్తే చిత్రంలో హీరోయిన్ గా నటించింది సంధ్య. ఆమెకు ఇది డెబ్యూ మూవీ. భరత్ హీరోగా చేశాడు. ఈ ట్రాజిక్ లవ్ డ్రామా అప్పట్లో సంచలనం నమోదు చేసింది. పేదవాడిని ప్రేమించిన హీరోయిన్ అనేక కష్టాలు పడుతుంది. అమ్మాయి కుటుంబ సభ్యులు హీరోని కొట్టి హింసిస్తారు. చివరికి హీరో పిచ్చోడు అయిపోతాడు. 2004లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం దక్కించుకుంది. ప్రేమిస్తే సక్సెస్ నేపథ్యంలో సంధ్యకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. పలు చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది.
అయితే త్వరగా సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయింది. స్టార్ హీరోల చిత్రాల్లో ఆమె చెల్లి పాత్రలు చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అన్నవరం చిత్రంలో సంధ్య చెల్లి రోల్ చేసింది. అన్నవరం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2016 వరకు సంధ్య బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. 2020 లో సీరియల్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కన్మణి అనే తమిళ్ సీరియల్ లో సంధ్య నటించింది.
కాగా సంధ్య లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కొంచెం బొద్దుగా ఉండే సంధ్య సన్నబడ్డాడు. సంధ్య 2015లో చెన్నై కి చెందిన సోఫ్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానం. ప్రస్తుతం నటనకు గుడ్ బై చెప్పింది. సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంటుంది. సంధ్య ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతుంటాయి.