జనసేన విజయం తర్వాత తొలిసారి చిరు ఇంటికి పవన్, అన్నయ్య కాళ్లపై పడి భావోద్వేగం..నాగబాబు కంటతడి, వీడియో

Published : Jun 06, 2024, 07:21 PM IST
జనసేన విజయం తర్వాత తొలిసారి చిరు ఇంటికి పవన్, అన్నయ్య కాళ్లపై పడి భావోద్వేగం..నాగబాబు కంటతడి, వీడియో

సారాంశం

పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది జనసేన పార్టీ. 

పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేల భారీ మెజారిటీ సాధించారు. 

ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ తొలిసారి విజయం తర్వాత చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరు నివాసంలో పవన్ కి ఘనస్వాగతం లభించింది. కుటుంబ సభ్యులంతా పవన్ ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. 

పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి, వదిన సురేఖ, అక్క చెలెళ్ళు పవన్ కి మంగళ హారతులతో స్వాగతం పలికారు. చిరంజీవిని చూడగానే పవన్ ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా చప్పట్లు కేరింతలు కొడుతూ తమ సంతోషం తెలిపారు. ఈ దృశ్యాలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. 

పక్కనే ఉన్న నాగబాబు సంతోషంతో కంటతడి పెట్టుకున్నారు. అనంతరం చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కేక్ కట్ చేయించారు. పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవా, తనయుడు అకిరా నందన్ తో కలసి చిరు ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తన తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. సురేఖ.. అన్నా లెజినోవాకి పసుపు కుంకుమ, పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెలెబ్రేషన్స్ లో రాంచరణ్, ఉపాసన దంపతులు.. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, శ్రీజ, నిహారిక పాల్గొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?