
పిల్లలు పెద్దగా మారిన కూడా ఎందుకో కథలో ఆసక్తి లేకపోవడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా తగ్గింది. ఇక దీంతో దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చి మొత్తానికి వంటలక్కను రంగంలోకి దింపాడు. ఇటీవలే వంటలక్క తిరిగి కార్తీకదీపం లోకి వస్తున్నట్లు ఒక చిన్న వీడియో కూడా వదిలారు. డాక్టర్ బాబు కూడా వస్తున్నట్లు క్లారిటీ వచ్చింది.
దీంతో ప్రేక్షకులు వీరి కోసం మళ్లీ ఎదురు చూస్తున్నారు. వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎంతో ఆశగా చూస్తున్నారు. దీంతో వంటలక్క మొత్తానికి వచ్చేసింది. తాజాగా వంటలక్క వచ్చినట్లు ప్రోమో కూడా వదిలారు స్టార్ మా యాజమాన్యం. ప్రమాదం జరిగిన తర్వాత వంటలక్క ఇంతకాలం హాస్పిటల్లో కోమాలో ఉన్నట్లు అర్థమవుతుంది.
దీంతో తనకు గతంలో జరిగిన ప్రమాదం గుర్తుకు రావడంతో కోమాలో నుండి బయటికి వచ్చి డాక్టర్ బాబు అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక ఈ ప్రోమో చూసిన వాళ్లంతా మొత్తానికి వచ్చే ఎపిసోడ్ కు వంటలక్క వస్తుందని క్లియర్ గా అర్థమయింది. ఈ వంటలక్క రావడంతో కార్తీకదీపం కచ్చితంగా రేటింగ్ విషయంలో సెంచరీ కొట్టడం గ్యారెంటీ అని తెలుస్తుంది.
https://www.youtube.com/watch?v=SSNwlAjIHg8