`ప్రేమ ఎంత మధురం` వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌.. రియల్ లైఫ్ జంటలతో..

Published : Feb 12, 2022, 04:23 PM IST
`ప్రేమ ఎంత మధురం` వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌.. రియల్ లైఫ్ జంటలతో..

సారాంశం

`ప్రేమ ఎంత మధురం` టైటిల్ సాంగ్, సీరియల్ రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన అభిమాన ఛానల్ ఎప్పుడూ కనీవినీ ఎరుగని రూపంలో ఆ టైటిల్ సాంగ్ చిత్రీకరణ చేసి అందరి ముందుకు తీసుకొచ్చింది  `జీ తెలుగు`.

ఎప్పుడూ తెలుగు వారి లోగిలల్లో మెరుస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న మన `జీ తెలుగు` వాలెంటైన్స్ వీక్ కోసం మరింత వినోదాన్ని, ప్రేమని పంచడానికి సిద్దమయింది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మొదటి సారి ఒక టైటిల్ సాంగ్ ని నిజజీవితంలో కూడా భార్యాభర్తలైన వారితో చిత్రీకరించారు. `ప్రేమ ఎంత మధురం` టైటిల్ సాంగ్(Prema Entha Madhuram), `ప్రేమ ఎంత మధురం సీరియల్ రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన అభిమాన ఛానల్ ఎప్పుడూ కనీవినీ ఎరుగని రూపంలో ఆ టైటిల్ సాంగ్ చిత్రీకరణ చేసి అందరి ముందుకు తీసుకొచ్చింది  `జీ తెలుగు`.

డిసెంబర్ 2021 చివరి వారంలో జీ తెలుగు మరియు `ప్రేమ ఎంత మధురం` అభిమానులు పండుగ పండుగ చేసుకున్నారు. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ పండుగ కాదు,`ప్రేమ ఎంత మధురం` పండుగ.  #ప్రేమఎంతమధురం కాంటెస్ట్ గురించి అందరికి తెలియచేసింది. ఆర్యవర్ధన్ (వెంకట్ శ్రీరామ్), అను (వర్ష హెచ్ కే) ఇరువురు కలిసి ఈ కాంటెస్ట్ గురించి వివరించారు. ఎందరో వందలాది మంది ఈ కాంటెస్ట్ కి వారి వివరాలు పంపించగా అందులో నుంచి మూడు జంటలను (భవ్య శ్రీ - రాహుల్, దీప్తి - మహేష్ మరియు ప్రదీశా - సందీప్) ఆర్య - అను మరియు ఛానల్ కలిసి సెలెక్ట్ చేసారు. 

ప్రేమకు అడ్రస్ గా మారిన ప్రేమ ఎంత మధురం సీరియల్ టైటిల్ సాంగ్ ని ఈసారి కూడా అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఆ మూడు జంటలు అను - ఆర్య తో టైటిల్ సాంగ్, చిత్రీకరణలో పాల్గొన్నారు, అంతే కాకుండా వారితో ఎన్నో మధురానుభూతాలు పంచుకున్నారు. ఒక్కొక్క జంటది ఒక్కో మధురమైన కథ. ఆ జంటల ఊసులు ఛానల్ - సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది.

స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్‌ ప్రేమ ఎంత మధురం ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు లో ప్రసారమవుతుంది. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి