Prabhas : ‘పునీత్ రాజ్ కుమార్’ గురించి ప్రభాస్ ఎమోషనల్ ట్వీట్.. ‘జేమ్స్’మూవీ ఎప్పుడూ ప్రత్యేకమే ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 03:55 PM ISTUpdated : Feb 12, 2022, 03:57 PM IST
Prabhas : ‘పునీత్ రాజ్ కుమార్’ గురించి ప్రభాస్ ఎమోషనల్ ట్వీట్.. ‘జేమ్స్’మూవీ ఎప్పుడూ ప్రత్యేకమే ..

సారాంశం

కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన మూవీ ‘జేమ్స్’. నిన్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు ‘అప్పు’ను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భావోద్వేగమైన ట్వీట్ చేశారు.     

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడైన పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నడనాట పవర్‌స్టార్‌గా గుర్తింపు, పాపులారిటీ, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విశేష సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో నిలిచిపోయారు. గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానులకు, ఫ్యామిలీకి, సినీ రంగానికి తీరని శోకం మిగిల్చారు.  ఇప్పటికీ ఆయనను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే అప్పు చివరిగా ‘జేమ్స్’ మరియు `ద్విత్వ` చిత్రాలకు కమిట్‌ అయ్యాడు. 

ఇందులో James చిత్రం అప్పటికే ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో పునీత్‌ రాజ్  కుమార్ సెక్యూరిటీ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ నిన్న రిలీజైంది. అనూహ్యా స్పందనను సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం  జేమ్స్ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని పునీత్ పుట్టిన రోజున మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

 

టీజర్ రిలీజైన సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  కూడా అప్పును గుర్త చేసుకుని, ఎమోషన్ ట్వీట్ చేశాడు. ‘జేమ్స్ మూవీ రూపంలో మేము ఒక కళాఖండాన్ని చూడబోతున్నామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సర్‌ని అభిమానించే కోట్లాది మందికి ఈ సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే. మేము నిన్ను కోల్పోయినందుకు చింతిస్తున్నాం’ అంటూ ప్రభాస్ కొంత ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ‘జేమ్స్’ టీంకు అల్ ద బెస్ట్ తెలిపారు. ఇందుకు వారు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పునిత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు. పునీత్ ‘ఇఫ్పుడు, ఎప్పుడూ కింగే’ అంటూ పేర్కొన్నాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?