
హీరోయిన్ అమీ జాక్సన్ చాలా కాలంగా జార్జ్ పనయటు అనే విదేశీయుడితో డేటింగ్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ గర్భవతి కూడా అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది.
పెళ్లి కాకుండానే తల్లయ్యే విషయంలో ఆమెపై విమర్శలు వినిపించాయి. ఇండియాలో దీన్ని తప్పుగా చూసినప్పుడు విదేశాల్లో ఇలాంటివి చాలా కామన్. దీంతో అమీ తనపై వచ్చిన విమర్శలపై పెద్దగా స్పందించలేదు.
తాజాగా అమీ జాక్సన్ కి తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం జరిగినట్లు తెలుస్తోంది. లండన్ ఈ జంట అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.