తొలి చిత్రం ‘అ!’తో విమర్శకుల ప్రశంసలు, విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. రెండో చిత్రం ‘కల్కి’ అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ యువ దర్శకుడు తెరకెక్కించిన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ . కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం పిభ్రవరి 5 న రిలీజ్ కు రెడీ అవుతోంది.
బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యాపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు.
తెలుగులో తొలి 'జాంబీ' జోనర్ చిత్రమిదని చిత్ర నిర్మాణ సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. వాస్తవ సంఘటనల ఆధారంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం నేపథ్యంలో హారర్ అంశాలతో ఇది రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ రైట్స్ 2.2 కోట్లకు అమ్ముడుపోయి..నిర్మాతలను ఆనందంలో ముంచెత్తిందని సమాచారం.
రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్‌డౌన్ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి.