సాధారణంగా రాజమౌళి ఎవరినీ నొప్పించే నిర్ణయాలు తీసుకోరు. కానీ తాజాగా రాజమౌళి తీసుకున్న డెసిషన్ తో బాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత అప్ సెట్ అయ్యినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఏమిటీ..ఏ నిర్మాత అప్ సెట్ అయ్యారు..కారణం ఏమిటి అనే విషయాల్లోకి వెళితే....
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్. రెండేళ్లుగా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ రాజమౌళి నిర్ణయంతో సంతోషంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం నిరాశ చెందినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అందుకు కారణం...ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదినే బోనీ కపూర్ ప్రొడక్షన్‌లో వస్తున్న మైదాన్ సినిమా విడుదల కావటమే. తాను ముందుగానే తన సినిమాను ఆరు నెలల క్రితమే ప్రకటించినా ఇప్పుడు అదే డేట్ కు ఆర్ ఆర్ ఆర్ రావటం షాక్ ఇచ్చిందిట. అంతేకాకుండా... ఈ రెండు సినిమాల్లోనూ అజయ్ దేవగణ్ నటిస్తుండటం విశేషం. అయితే ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీకి ముందే బోనీ కపూర్‌తో మాట్లాడాలని అజయ్ రాజమౌళిని కోరాడని చెప్తున్నారు.
ఇక అజయ్ దేవగన్ నటిస్తున్న మైదాన్ చిత్రం ఫుట్‌బాల్ లెజండరీ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఆర్ ఆర్ ఆర్ వేడిలో ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోరు. మీడియా అటెన్షన్ ఉండదు. సీనియర్ నిర్మాత అయిన బోనీ కపూర్ కు ఇవన్నీ తెలుసు. అందుకే ప్రత్యేకంగా రాజమౌళితో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీని ప్రకటించే ముందు బోనీ కపూర్‌ను సంప్రదించాలని అజయ్ దేవగణ్ చెప్పినట్లు సమాచారం. అయితే బోనీ కపూర్‌ను కలవకుండానే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించాడని అంటున్నారు.
ఇదిలా ఉండగా...బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ రీమెక్ వకీల్ సాబ్‌ను బోనీ కపూర్, దిల్ రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.