బాలయ్యతో ప్రయోగాలు చేస్తాడట

Published : Jun 25, 2019, 07:02 PM IST
బాలయ్యతో ప్రయోగాలు చేస్తాడట

సారాంశం

  నందమూరి బాలకృష్ణ తో వర్క్ చేయడానికి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అ! సినిమాతో సరికొత్త దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నెక్స్ట్ కల్కితో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 

నందమూరి బాలకృష్ణ తో వర్క్ చేయడానికి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అ! సినిమాతో సరికొత్త దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నెక్స్ట్ కల్కితో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ యువకెరటం డ్రీమ్ ప్రాజెక్టుల పైస్పందించాడు. 

గతంలో మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణని ఒకే తెరపై చూపించేలా మల్టీస్టారర్ చేయాలనీ ఉందని చెప్పిన ప్రశాంత్ రీసెంట్ గా కుదిరితే బాలకృష్ణతో సపరేట్ గా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని అన్నాడు. అందుకు కొన్ని క్రేజీ ఆలోచనలు కూడా ఉన్నట్లు చెప్పాడు. 

బాలకృష్ణ గతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య అదే ఫార్మాట్ లో సినిమాలు చేయాల్సి వస్తోంది. ఆయనతో సెట్టయితే కొన్ని స్పెషల్ కథలు రెడీ చేస్తానని వివరణ ఇచ్చాడు. మరి ఈ దర్శకుడి ఆలోచనలు బాలకృష్ణకు ఎంతవరకు నచ్చుతాయో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?