థ్రిల్ చేయడానికి సిద్దమైన కల్కి.. సెన్సార్ వర్క్ ఫినిష్

Published : Jun 25, 2019, 06:36 PM IST
థ్రిల్ చేయడానికి సిద్దమైన కల్కి.. సెన్సార్ వర్క్ ఫినిష్

సారాంశం

  సీనియర్ హీరో రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాతో మరింత బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. గరుడవేగతో మెప్పించిన యాంగ్రీ హీరో కల్కితో మరింతగా థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు.

సీనియర్ హీరో రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాతో మరింత బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. గరుడవేగతో మెప్పించిన యాంగ్రీ హీరో కల్కితో మరింతగా థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కల్కి సినిమాకు అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. 

ఈ నెల 28న విడుదల కానున్న కల్కి సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ అందుకున్న కల్కి సెన్సార్ యూనిట్ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. 1980ల కాలంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే రిలీజైన టీజర్ - ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తున్నాయి. శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న కల్కి సినిమాలో ఆదా శర్మా - నందితా శ్వేతా హీరోయిన్స్ గా నటించారు. శివాని - శివాత్మిక సమర్పణలో సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?