శ్రీదేవి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన జాన్వీకపూర్, బాలీవుడ్ బ్యూటీ.. ఎమోషనల్ స్పీచ్

Published : Dec 16, 2023, 02:13 PM ISTUpdated : Dec 16, 2023, 02:17 PM IST
శ్రీదేవి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన జాన్వీకపూర్, బాలీవుడ్ బ్యూటీ.. ఎమోషనల్ స్పీచ్

సారాంశం

తన తల్లి శ్రీదేవిని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. తన తల్లికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను తలుచుకుని బాధపడింది బ్యూటీ. ఇంతకీ శ్రీదేవి గురించి జాన్వీ ఏమంటుందంటే..? 


రీసెంట్ గా తన తల్లి శ్రీదేవి తలుచుకుని ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్. ఈమధ్య  ముంబయిలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్ లో మాట్లాడింది జాన్వీ. యంగ్ హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకుపోతోంది జాన్వీ.  తన తల్లి దివంగత తార  శ్రీదేవిని తలచుకొని భావోద్వేగానికి గురైంది. తన కెరీర్ బిగినింగ్ లో శ్రీదేవిని దూరం పెట్టిన సందర్భాన్ని తలుచుకుని బాధపడింది. 

జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ధడక్‌ ఈ మూవీ  షూటింగ్‌ టైమ్ లో తన తల్లి శ్రీదేవిని.. తనసినిమా షూటింగ్  లొకేషన్‌కు రావొద్దని చెప్పానని, తన నిర్ణయం తప్పని కొంతకాలానికి అర్థం చేసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జాన్వీకపూర్‌ మాట్లాడుతూ... మా అమ్మకు ఉన్న పేరు ప్రతిష్టల కారణంగానే నాకు అవకాశాలు వస్తున్నాయని అందరూ అనుకునేవారు. అందుకే అమ్మను షూటింగ్‌ లొకేషన్‌కు రావొద్దని చెప్పాను అన్నారు. 

తాను ఇండస్ట్రీకి  వచ్చింది శ్రీదేవి వారసురాలిగానే అయినా.. తన పైన  వారసత్వం తాలూకు  ఛాయలు ఏమాత్రం  లేకుండా ఉండాలని.. తాను తన నా సొంత కాళ్ల మీద నిలబడి.. ఇండస్ట్రీలో  ఎదగాలని ప్రయత్నించాను అంటోంది. కాని కెరీర్ బిగినింగ్ లో  ఏదో తెలియని అభద్రతాభావం ఉండేది. అంచనాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఒత్తిడికి గురయ్యేదాన్ని.. అంటు తన బాధను వ్యక్తం చేసింది. 

అమ్మ ఎలాంటి సలహాలు ఇచ్చిన తీసుకునేదాన్ని కాదు. కొంతకాలం గడిచాక నా నిర్ణయాలు తప్పని తెలుసుకొని బాధపడ్డాను. ఇప్పుడు అమ్మ ఉంటే తనను షూటింగ్‌కు పిలిచి ఆనందంగా ఎన్నో విషయాలను పంచుకోవాలనిపిస్తున్నది. శ్రీదేవి కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నా’ అని జాన్వీకపూర్‌ చెప్పింది. ‘దేవర’ చిత్రంలో జాన్వీకపూర్‌..తంగమ్‌ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్  హిందీతో పాటు  సౌత్ వైపు కూడా దృష్టి పెట్టింది.  ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది బ్యూటీ. ఈమూవీ తరువాత మరిన్ని ఆపర్లు ఆమెను వరించబోతున్ట్టు తెలుస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో కూడా తనకు తానే సాటి అనిపించకుంది బ్యూటీ. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి