బెస్ట్ బీస్ట్ అంటున్న ప్రశాంత్ నీల్... విజయ్ మూవీ గురించి కెజియఫ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Published : Apr 03, 2022, 08:07 PM IST
బెస్ట్ బీస్ట్ అంటున్న ప్రశాంత్ నీల్... విజయ్ మూవీ గురించి కెజియఫ్ డైరెక్టర్  ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ రిలీజ్ కు ముందే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఏప్రిల్ 13న బీస్ట్ రీలీజ్ కాబోతుంది. ఆతరువాత రోజే కెజియఫ్ రిలీజ్ అవుతుంది. పోటా పోటీగా ఈ రెండుసినిమాలు రిలీజ్ కాబోతున్న టైమ్ లోనే  బీస్ట్ ట్రైలర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.    

దళపతీ విజయ్ హీరోగా.. యంగ్ స్టార్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీకి  అనిరుద్ మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్, పోస్టర్స్,  సాంగ్స్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. 

ఈ ట్రైలర్ ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. సౌత్ లోనే టాప్ ట్రైలర్ గా బీస్ట్ హడావిడి చేస్తుంది. తెలుగులో కూడా ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ 28 మిలియన్స్ వ్యూస్ రాగా, 2.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ కు ముందే ట్రైలర్ రూపంలో భారీ ట్రీట్ ను అందుకున్నారు మూవీ టీమ్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక ఈ ట్రైలర్ పై ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.  వావ్, అన్నికంటే బెస్ట్ గా బీస్ట్ ట్రైలర్  ఉంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది, డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, విజయ్ సర్ ఫైర్ అంటూ ట్వీట్ చేశారు. కెజియఫ్ డైరెక్టర్ చేసిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

కేజీఎఫ్ సినిమా  దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 మూవీతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీగా రిలీజ్ కు రెడీ అవుతుంది.బీస్ట్ సినిమా మాత్రం ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల మధ్య భారీగా పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?