Maa Election: సీఎం జగన్‌కి, పేర్నినానిలకు థ్యాంక్స్ చెప్పిన ప్రకాష్‌ రాజ్‌..

Published : Oct 04, 2021, 08:00 PM IST
Maa Election: సీఎం జగన్‌కి, పేర్నినానిలకు థ్యాంక్స్ చెప్పిన ప్రకాష్‌ రాజ్‌..

సారాంశం

 పేర్ని నాని వీడియోని పోస్ట్ చేస్తూ, `గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ మంత్రి పేర్ని నానిలకు ధన్యవాదాలు. `మా` ఎన్నికలపై తమ బాధ్యత, గౌరవాన్ని ప్రకటించినందుకు` అని పేర్కొన్నారు ప్రకాష్‌ రాజ్‌. 

ప్రకాష్‌ రాజ్‌.. ఏపీ సీఎం వై.ఎస్‌ జగన్‌, మంత్రి పేర్నినానిలకు ధన్యవాదాలు. `మా` ఎన్నికలకు తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని ఓ వీడియో ద్వారా స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు. పేర్ని నాని వీడియోని పోస్ట్ చేస్తూ, `గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ మంత్రి పేర్ని నానిలకు ధన్యవాదాలు. `మా` ఎన్నికలపై తమ బాధ్యత, గౌరవాన్ని ప్రకటించినందుకు` అని పేర్కొన్నారు ప్రకాష్‌ రాజ్‌. 

`మా` ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉందని, రాజకీయ ప్రముఖులు కొందరికి సపోర్ట్ చేస్తున్నారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. `తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేద`ని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. 

related news: Maa elections: జగన్ కేం సంబంధం లేదని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పేర్ని నాని

అక్టోబర్ 10 `మా` ఎన్నికలు జరుగుతున్నాయి. 2021-23కిగానూ ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం `మా` అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య వాదోపవాదనలు, `మా` ఎన్నికలపై జరుగుతున్న చర్చని చూస్తుంటే సాధారణ ఎన్నికలను తలపిస్తుండటం విశేషం. టాలీవుడ్‌లో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?