సినీ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. ఈ నెల 7వ తేదీ వరకు ఆర్యన్ ను ఎన్సీబీ కస్టడీకి అనుమతిని ఇచ్చింది కోర్టు.
ముంబై: సినీ నటుడు షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) బెయిల్ పిటిషన్ (bail petition)ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 7వ తేదీ వరకు ఆర్యన్ ఖాన్ ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
also read:షారుఖ్ తనయుడు అరెస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న రేవ్ పార్టీ, రూ.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ఈ నెల 2వ తేదీన క్రూయిజ్ షిప్ పార్టీలో నిర్వహించిన రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని కచ్చితమైన సమాచారం మేరకు ఎన్‌సీబీ అధికారులు దాడి చేసి ఆర్యన్ సహా పలువురిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను కోర్టులో హాజరుపర్చారు ఎన్సీబీ అధికారులు. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
ఆర్యన్ ఖాన్ ఫోన్ లో కీలకమైన సమాచారం ఉందని ఎన్సీబీ అధికారులు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్యన్ నుండి కొకైన్ కూడ సీజ్ చేసినట్టుగా కోర్టుకు తెలిపింది కోర్టు.
ఆర్యన్ ఖాన్ నుండి డ్రగ్స్ కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఎన్సీబీ అధికారులు కోరారు. ఎన్సీబీ అధికారుల వినతికి కోర్టు అంగీకరించింది. ఈ నెల 7వ తేదీ వరకు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.