విడాకుల తర్వాత నాగచైతన్య ఫస్ట్ ఇంటర్వ్యూ.. అదొక మ్యాజికల్‌ జర్నీ అంటూ ఎమోషనల్‌..

Published : Oct 04, 2021, 07:12 PM IST
విడాకుల తర్వాత నాగచైతన్య ఫస్ట్ ఇంటర్వ్యూ.. అదొక మ్యాజికల్‌ జర్నీ అంటూ ఎమోషనల్‌..

సారాంశం

నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటనతో టాలీవుడ్‌ షాకి గురయ్యింది. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య ఫస్ట్ టైమ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

నాగచైతన్య(naga chaitanya), సమంత(samantha) రెండు రోజుల క్రితం తమ విడాకుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారి ప్రకటనతో చిత్ర పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది. వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ, ఊహించని విధంగా తమ డైవర్స్ ని అనౌన్స్ చేసి షాకిచ్చారు. దీంతో ఎక్కడ చూసినా వీరిద్దరు గురించిన చర్చే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్‌ నాగచైతన్య ఇంటర్వ్యూ ఇచ్చారు. డైవర్స్ తర్వాత ఫస్ట్ టైమ్‌ ఆయన మాట్లాడారు. ఇప్పుడా వీడియో వైరల్‌ అవుతుంది. 

ఇందులో ప్రధానంగా తాను నటించిన `లవ్‌ స్టోరీ` కి సంబంధించి డిస్కషన్‌ జరిగింది. ఎక్కడా పర్సనల్‌ లైఫ్‌ డిస్కస్‌ జరగలేదు. కేవలం `లవ్‌ స్టోరి` జర్నీని వెల్లడించారు. సినిమా సక్సెస్‌ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు చైతూ. చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఇదొక మ్యాజికల్‌ జర్నీ అని, అన్నీ మ్యాజికల్‌గా జరిగాయంటూ ఎమోషనల్‌గా తెలిపారు. రేవంత్‌ అనే పాత్రని ఎప్పుడూ చేయలేదని, ఇలాంటి పాత్ర తనకు పూర్తిగా కొత్త అని వెల్లడించారు. ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. తెలంగాణ యాసలో మాట్లాడటం కూడా టఫ్‌ జాబ్‌ అన్నారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల సపోర్ట్ తోనే సాధ్యమైందన్నారు. 

related news: విడిపోయాక మొదటి పోస్ట్.. కారణాలు చెప్పిన సమంత!

మరోవైపు సినిమా చేస్తున్నంత సేపు తాను, సాయిపల్లవి రేవంత్‌, మౌనిక పాత్రల్లోనే ఉండిపోయామని, రియల్‌ లైఫ్‌ పాత్రలను మర్చిపోయామన్నారు. కో యాక్టర్స్ మంచి ఎనర్జీ ఇస్తారని, వారి వల్ల మనకు ఉత్సాహం వస్తుందన్నారు. ఈ సినమాని నటుడిగా చాలా నమ్మి చేశానని, సినిమా కోసం చాలా కష్టపడ్డామన్నారు చైతూ. ఎంతో ఇన్‌వాల్వ్ అయి చేశామని, తమ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ప్రస్తుతం సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే హ్యాపీగా ఉందన్నారు. ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు.. కమల్‌కి పైడి జయరాజ్‌ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్‌ అవార్డు