కమెడియన్ ని కొట్టిన సీనియర్ యాక్టర్!

Published : Sep 29, 2018, 02:33 PM ISTUpdated : Sep 29, 2018, 02:35 PM IST
కమెడియన్ ని కొట్టిన సీనియర్ యాక్టర్!

సారాంశం

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఓ సినిమా షూటింగ్ సెట్స్ లో కమెడియన్ ని కొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మిస్తోన్న 'హలో గురు ప్రేమకోసమే' సినిమా షూటింగ్ లో భాగంగా ప్రకాష్ రాజ్ తో కలిసి నటిస్తోన్న కమెడియన్ సప్తగిరిపై ఆయన చేయి చేసుకున్నట్లుగా వార్తలు బయటకి వచ్చాయి. 

 గతంలో ఇదే సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని డైలాగ్స్ సరిగ్గా చెప్పడంలేదని కోప్పడినట్లు, దాంతో సెట్ లోనే ఆమె ఏడ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తల్లో నిజం లేదని చెప్పే ప్రయత్నం చేసినా.. దర్శకుడు త్రినాధరావు నక్కిన ప్రకాష్ రాజ్ కోప్పడిన మాట నిజమేనని ఓ మీడియా ప్రతినిధితో వెల్లడించారు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్.. సప్తగిరిని కొట్టినట్లుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదనినిర్మాత దిల్ రాజు కవర్ చేస్తున్నాడు.

అయితే దర్శకుడు త్రినాధరావు మాత్రం ఆ సమయంలో తను షూటింగ్ లేనని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇందులో నిజం లేదంటే ఇప్పటికే సప్తగిరి బయటకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఎంతో యాక్టివ్ గా ఉండే తను ఈ విషయంపై మౌనం వహించడం ఈ విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది!

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?