బాస్‌ని కలిసిన ప్రకాష్‌రాజ్‌.. ఆసక్తిరేపుతున్న సడెన్‌ మీటింగ్‌

Published : Aug 17, 2021, 11:49 AM IST
బాస్‌ని కలిసిన ప్రకాష్‌రాజ్‌.. ఆసక్తిరేపుతున్న సడెన్‌ మీటింగ్‌

సారాంశం

నిన్ననే(సోమవారం) తన చేతి గాయానికి సంబంధించిన సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మంగళవారం ఉదయం జిమ్‌కి వెళ్లారు. అక్కడ మెగాస్టార్‌ని కలిశారు ప్రకాష్‌ రాజ్‌.

వరుస ట్వీట్లతో `మా` ఎన్నికలకు సంబంధించి దుమారం సృష్టిస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ ఇప్పుడు మరో ఆసక్తకిర పరిణామాలకు తెరలేపారు. ఆయన తాజాగా చిరంజీవిని కలిశారు. నిన్ననే(సోమవారం) తన చేతి గాయానికి సంబంధించిన సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మంగళవారం ఉదయం జిమ్‌కి వెళ్లారు. అక్కడ మెగాస్టార్‌ని కలిశారు ప్రకాష్‌ రాజ్‌. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

`బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తిదాయకం అన్నయ్య` అంటూ ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. దీంతో ఇప్పుడిది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ప్రకాజ్‌ రాజ్‌ `మా` ఎన్నికల బరిలో ఉన్నారు. అధ్యక్షుడి కోసం ఆయన పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆయన తన ప్యానెల్‌ని ప్రకటించి ప్రెస్‌మీట్‌ కూడా పెట్టారు. ఎన్నికల వరకు తాను `మా` ఎలక్షన్ల గురించి మాట్లాడనని తెలిపారు. 

అయితే ఇండైరెక్ట్ గా ట్వీట్ల రూపంలో హీటు పెంచుతున్నారు. `ఎన్నికలెప్పుడు`, `జెండా ఎగరేస్తాం`..  అంటూ ఆయన పెట్టిన ట్వీట్లు ఫిల్మ్ నగర్‌లో దుమారం రేపుతున్నాయి. ఇటీవల నటి హేమ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి ఫైర్‌ అయ్యారు. `మా` ప్రతిష్ట దిగజార్చే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మెన్ కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవిని ప్రకాష్‌ రాజ్‌ కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనేక కొత్త పరిణామాలకు తెరలేపినట్టువుతుంది. `మా` ఎన్నికల వేడి మరింత రక్తికట్టేలా తయారైందని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిల ఉంటే ఈ నెల 22 `మా` సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్