పవన్‌ లుంగీ కడితే రికార్డుల మోత.. రానా ఫ్యాన్స్ లో అసంతృప్తి సెగ..

Published : Aug 17, 2021, 09:28 AM IST
పవన్‌ లుంగీ కడితే రికార్డుల మోత.. రానా ఫ్యాన్స్ లో అసంతృప్తి సెగ..

సారాంశం

లుంగీ కట్టి పవన్‌ కళ్యాణ్‌ మాస్‌ ఎంట్రీ, చేసిన యాక్షన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌నిచ్చాయి. దీంతో అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ ని తెగ చూసేశారు. దీంతో ఇది కేవలం 24 గంటల్లోనే పదిమిలియన్స్ వ్యూస్‌ని, ఏడున్నర లక్షల లైక్స్ ని రాబట్టుకుంది. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి తన సత్తాని చాటారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ ని రుచి చూపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్ర టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో లుంగీ కట్టి పవన్‌ కళ్యాణ్‌ మాస్‌ ఎంట్రీ, చేసిన యాక్షన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌నిచ్చాయి. దీంతో అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ ని తెగ చూసేశారు. దీంతో ఇది కేవలం 24 గంటల్లోనే పదిమిలియన్స్ వ్యూస్‌ని, ఏడున్నర లక్షల లైక్స్ ని రాబట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ఈ ఫస్ట్ గ్లింమ్స్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. 

సోషల్‌ మీడియాలో పవన్‌ `భీమ్లా నాయక్‌` ఫస్ట్ గ్లింప్స్ ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇండియా వైడ్‌గా ఇది ట్రెండ్‌ అవుతూ, అన్ని రికార్డులను కొల్లగొడుతుంది. ఇదిలా ఉంటే ఇది రానా ఫ్యాన్స్ ని మాత్రం తీవ్ర నిరాశకి గురి చేస్తుంది. ఇందులో రానా దగ్గుబాటి  మరో హీరోగా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌`కిది రీమేక్‌ అనే విషయం తెలిసిందే. అయితే అందులో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. నువ్వా నేనా అనేట్టుగా సాగుతుంది. 

కానీ తెలుగు రీమేక్‌ `భీమ్లా నాయక్‌`లో మాత్రం పవన్‌ కళ్యాణ్‌నే ప్రధానంగా చూపిస్తున్నారు. పవన్‌ సినిమాగానే ప్రమోట్‌ చేస్తున్నారు. టైటిల్‌ కూడా పవన్‌ పాత్ర ప్రధానంగానే పెట్టారు. కానీ మలయాళంలో ఇద్దరు హీరోల పేర్లతో కలిసి టైటిల్‌ ఉంటుంది. ఇదే ఇప్పుడు రానా అభిమానులకు మింగుడు పడటం లేదు. తెలుగులో రానా పాత్రని తగ్గించి చూపిస్తున్నట్టుగా ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్‌ చిత్రాల ఆధారంగా అర్థమవుతుందని, దీంతో రానా అభిమానులు అసంతృప్తిలో ఉన్నారని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. 

టైటిల్‌లో రానాకి ప్రయారిటీ దక్కలేదు. ఫస్ట్ గ్లింప్స్ లోనూ రానా ఊసేలేదు. కేవలం వాయిస్‌ ఓవర్‌లో డేనియల్‌ శేఖర్‌ అని మాత్రమే వినిపించారు. దీంతో ఆయన పాత్రని ఓ చిన్న క్యారెక్టర్‌గానే చూపించే ప్రయత్నం జరుగుతుందా? అని రానా అభిమానులు ఆవేదన చెందుతున్నారట. అయితే ఇదంతా ఓ ప్లాన్‌ ప్రచారం జరుగుతుందని, రానాకి కూడా ప్రయారిటీ ఉందని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.మరి మొత్తంగా ఈ చిత్రాన్ని పవన్‌ సినిమాగానే జనాల్లోకి తీసుకెళ్తారా? లేక మున్ముందు రానాకి కూడా ప్రయారిటీ ఇస్తూ ఫస్ట్ గ్లింప్స్ వంటి ప్రచార చిత్రాలు విడుదల చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. 

ఇక ఈ చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు అందించడంతోపాటు స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా, జనవరి 12న విడుదల చేయబోతున్నారు.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?