వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. హిట్టు ప్లాప్ అని చూడకుండా.. సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ కోసం హీరోయిన్లను వెతకడం డైరెక్టర్లకుపెద్ద పనిగా మారింది.
ప్రభాస్ సినిమాలు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ అయిపోయిన పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా.. ప్రాజెక్ట్ కే షూటింగ్ ఇంకా మేజర్ పార్ట్ ఉండిపోయింది. అటు సినిమాలు కంప్లీట్ చేస్తూ.. ఇటు కొత్త సినిమాలు కమిట్ అవుతున్నాడు ప్రభాస్. అందులో భాగంగా మారుతీతో సినిమా చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈక్రమంలో ఈ సినిమాకు సబంధించిన కొన్ని అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి.
కొంత కాలంగా ప్రభాస్-మారుతి సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమా అని అంటున్నారే తప్పించి అపీషియల్ గా అనౌన్స్ చేసింది లేదు. కాని షూటింగ్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. ప్రభాస్ కూడా ఫస్ట్ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకో ఈ మూవీ విషయంలో సీక్రేట్ మెయింటేన్ చేస్తున్నారు.
ఇక ఈమూవీకి మొదటి నుంచి ప్రచారంలో రాజా డీలక్స్ అనే టైటిల్ ఉంది. దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ అంటున్నారు సినీ జనాలు. ఇక ఈమూవీలో ప్రభాస్ జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. అందులో మాళవికా మోహాన్, నిథి అగర్వాల్ ఇప్పటికే సెలక్ట్ అవ్వగా మూడో హీరోయిన్ పై తాజాగా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు మూడో జోడీగా లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రిద్దీ కుమార్‌ను మూడో హీరోయిన్‌గా మేకర్స్ అనుకుంటున్నారట. రీసెంట్ గా రాధేశ్యామ్‌లోనూ ఈమె తారా పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో ఆర్చర్ అవ్వాలనుకున్న రిద్ధీ ట్రైన్ యాక్సిడెంట్‌లో చేయి పోగోట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌కు జోడీగా చేయనుంది.
అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవళ్ల కథతో సాగుతుందట. ఇదే కథకి మారుతి తన శైలి హార్రర్ కమెడీ టచ్ అప్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం టీమ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తుంది. దీని కోసం దాదాపు 6 కోట్లతో స్పెషల్ సెట్ ను నిర్మించినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ లో ఉండగా.. సలార్ మూవీ కూడా కంప్లీట్ కావచ్చింది. ప్రాజెక్ట్ కే కాస్త లేట్ గా నడుస్తుంది. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ డౌరెక్షన్ లో స్పిరిట్ సినిమాను స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఇక మారుతీ సినిమా విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.