ప్రకాష్ రాజ్ కు షాక్.. నేను రాను, కోర్టుకి వెళ్ళమంటున్న ఎన్నికల అధికారి

By telugu team  |  First Published Oct 18, 2021, 1:48 PM IST

'మా' ఎన్నికల వివాదంలో రోజుకొక చిత్రం చోటు చేసుకుంటోంది. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానల్ ఇరు పక్షాలలో ఎవ్వరూ సైలెంట్ కావడం లేదు. దీనికితోడు సీసీటీవీ ఫుటేజ్ వివాదం కూడా ముదురుతోంది.


'మా' ఎన్నికల వివాదంలో రోజుకొక చిత్రం చోటు చేసుకుంటోంది. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానల్ ఇరు పక్షాలలో ఎవ్వరూ సైలెంట్ కావడం లేదు. దీనికితోడు సీసీటీవీ ఫుటేజ్ వివాదం కూడా ముదురుతోంది. ఎన్నికలు జరిగిన విధానంపై తనకు అనుమానాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకాష్ రాజ్ అంటున్నారు. 

సిసిటివి ఫుటేజ్ చూపించాలని Prakash Raj ఇప్పటికే మా ఎన్నికల అధికారి Krishna Mohan కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే సిసిటివి ఫుటేజ్ చూపించేందుకు కృష్ణ మోహన్ స్పందించకపోవడంతో ప్రకాష్ రాజ్ పోలీసులని ఆశ్రయించారు. దీనితో ఈ ఉదయం పోలీసులు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి వెళ్లి సర్వర్ రూమ్ ని పరిశీలిస్తున్నారు. 

Latest Videos

undefined

Also Read: పవన్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్.. వీడియోలో చూసింది నిజం కాదు.. మంచు విష్ణు క్లారిటీ..

అయితే ప్రకాష్ రాజ్ కు ఫుటేజ్ చూపిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి బయటకు వచ్చారు. లోపల కొంత ఫుటేజ్ ని పరిశీలించానని అన్నారు. అయితే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన 7 కీలక కెమెరాల డేటా చూడాలంటే ఎన్నికల అధికారి అనుమతి అవసరం అంటున్నారు. ఎన్నికల అధికారి మాత్రం ఇక్కడకు రావడం లేదు. కోర్టు ద్వారా అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. 

Also Read: థైస్ అందాలతో రెచ్చగొడుతూ గుడ్ న్యూస్ చెప్పిన ప్రగ్యా జైస్వాల్.. హాట్ ఫోటోస్ వైరల్

ఈ వారంలో ఆ 7 కెమెరాల ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తా. అనుమానంతో ఎవ్వరూ ఉండకూడదు. దయచేసి దీనిని వివాదం చేయొద్దు అని ప్రకాష్ రాజ్ అన్నారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా పనిచేసుకోవచ్చు. ఆయన పనితీరుని మేము కూడా గమనిస్తాం అని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

click me!