అఘోరా అయ్యింది, ఇప్పుడు స్వామీజీ గా బాలయ్య ?

By Surya Prakash  |  First Published Oct 18, 2021, 1:15 PM IST

 ఈ కాంబోలో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ  సినిమాలో బాలయ్య మళ్ళీ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అలాగే  ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే బాలయ్య డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడు.  


బాలయ్య కొత్త తరహా కథలు ఎంచుకుంటూ కొత్త తరహా గెటప్ లలో కనిపించటానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఇప్పటికే యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న ‘అఖండ’ సినిమాలో అఘోర పాత్రలో నటిస్తున్నాడు. ఆ గెటప్ కు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు స్వామీజీ పాత్రను పోషించటానికి సిద్దపడుతున్నాడు Balakrishna. అయితే కొద్ది సేపే కనపడతాడని సమాచారం. ఇలా బాలయ్య, అఘోర, స్వామీజీ పాత్రల పై ఆసక్తి చూపించడం విశేషంగా చెప్తున్నారు. ఇంతకీ బాలయ్య ..స్వామిజీ గెటప్ లో కనిపించేది ఏ చిత్రంలో అంటే...గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాలో అంటున్నారు.

వివరాల్లోకి వెళితే..."డాన్ శీను", "బలుపు", "పండగ చేసుకో" వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన Gopichand Mmalineni ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు.  ఈ కాంబోలో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ  సినిమాలో బాలయ్య మళ్ళీ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అలాగే  ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే బాలయ్య డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడు. అయితే, రెండు పాత్రలలో ఓ పాత్ర స్వామీజీ పాత్ర అట. అంటే, బాలయ్య ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు స్వామీజీ గెటప్ లో కనిపించనున్నాడు.

Latest Videos

also read: పవన్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్.. వీడియోలో చూసింది నిజం కాదు.. మంచు విష్ణు క్లారిటీ..

ఈ సినిమా స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని, ప్రస్తుతం డైలాగు వెర్షన్ జరుగుతోందని వినికిడి. ఈ  కథలో ఫుల్ యాక్షన్ తో పాటు ఓ  ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే .. కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి "జై బాలయ్య" అనే టైటిల్ ను ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీని గురించి అధికారిక ప్రకటన కూడా నవంబర్ లో సినిమా ఓపెనింగ్ సమయంలో విడుదల చేయబోతున్నారని టాక్. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 

click me!