మహేష్ బాబుతో కలిసి చేసిన ఆ పాత్రపై ప్రకాశ్ రాజ్ అసంతృప్తి, సంతోషాన్నిచ్చిన పాత్రలేమిటంటే..?

Published : Jul 18, 2022, 01:55 PM IST
మహేష్ బాబుతో కలిసి చేసిన  ఆ పాత్రపై ప్రకాశ్ రాజ్ అసంతృప్తి, సంతోషాన్నిచ్చిన పాత్రలేమిటంటే..?

సారాంశం

 స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ఆ పాత్రను తాను అయిష్టంగానే చేశానంటూ బాంబ్ పేల్చారు. ఇంతకీ అంతా ఇష్టం లేకుండా ప్రకాశ్ రాజ్ చేసిన పాత్రం ఏంటీ..? 

ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన సౌంత్ ఇండస్ట్రీలో ప్రతీ ప్రేక్షకుడికీ తెలుసు.   పాత్ర  కొంచెం అయినా.. దాన్ని తన నటనతో  తీసుకువెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు. ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయి నటించడంలో ప్రకాశ్ రాజ్ కి సాటి ఎవరూ రారు. ఒక్కొక్క సారి ఆయన నటన ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలకు కూడా  ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో వందలసినిమాలలో రకరకాల పాత్రలతో నటించి మెప్పించిన ప్రకాశ్ రాజ్ తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్నిచెప్పారు. తాను చేసిన పాత్రల్లో అయిష్టంగా చేసిన పాత్ర అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో చేసిన పాత్ర గురించి వివరంగా చెప్పారు.  

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ఆ పాత్ర గురించి ప్రకాశ్ రాజ్ చెపుతూ.. ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రలలో  నేను చేసిన ఒక పాత్ర సరిలేరును నీకెవ్వరు సినిమాలో మినిస్టర్ పాత్ర.  సినిమాలో అబద్ధాలాడే ఒక రాజకీయనాయకుడి పాత్రను నేను అయిష్టంగానే చేశాను. కొన్ని సార్లు మన నిర్ణయాలతో .. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్. 

మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో నేను అలాంటి పాత్రను చేయడం నాకు పెద్ద అసంతృప్తిగా అనిపించినా.. ఆయన నిర్మించిన మేజర్  సినిమాలో నటించడం మాత్రం తనకు గర్వకారనం అని చెప్పారు ప్రకాశ్ రాజ్. అంతే కాదు తాను చేసిన పాత్రల్లో మేజర్ లో చేసిన  పాత్ర తనకు సంతృప్తినిచ్చిందన్నారు ప్రకాశ్ రాజ్. ఇక తనకు జీవితంలో సంతోషాన్ని ఇచ్చిన పాత్రల లిస్ట్ లో  ఆకాశమంత .. బొమ్మరిల్లు  సినిమాల్లోని ఫాదర్ క్యారెక్టర్లు  చాలా సంతోషాన్ని కలిగించాయి అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..